అన్నం ఉడికేటప్పుడు వచ్చే గంజిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల....

మన పూర్వీకులు అప్పట్లో మనకన్నా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు ముఖ్య కారణం ఏంటంటే వారి ఆహారపు అలవాట్లు. సాధరణంగా మనం అన్నం వండినప్పుడు అన్నం ఉడికేటప్పుడు వచ్చే గంజిని పారపోస్తుంటాం. కానీ మన పూర్వీకులు అలా చేసేవారు కాదు. ఆ గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. 


అంతేకాదు ఇలా గంజి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకే మను పూర్వీకులు మనకన్నా చాల బలిష్టంగా ఉండేవారు. ప్రస్తుతం చాలామంది ఇప్పుడు గంజిని పనికి రాదని భావించి పారబోస్తుంటారు. కానీ వాస్తవానికి ఆ గంజిలోని పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. బీ, ఇ, సీ విటమిన్లు అలాగే మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా అతిసారం, కడుపు నొప్పి లాంటివాటితో ఇబ్బంది పుడుతున్నప్పుడు ఒక తిన్న గ్లాసు తీసుకొని అందులో పలచటి గంజి పోసుకోని తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఈ గంజిలో ఉండే పిండి పదార్థం బైండింగ్ ఏజంట్‌గా పనిచేస్తుంది. అలాగే ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. అలసటను కూడా తగ్గిస్తుంది. మరో విషయం ఏంటంటే గంజిలో బీ, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు గంజి తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. అలాగే సాధారణంగా మహిళలకు వచ్చే నెలసరి నొప్పులను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాల ఉపశమనానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

 చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గించుకునేందుకు వ్యాయాలు చేయడం, డైటింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లాసు గంజిని తాగినా కూడా ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. వేసవి కాలంలో చాలామందికి శక్తి త్వరగా ఆవిరైపోతూ ఉంటుంది. అలాంటివారికి గంజి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది తాగితే తర్వాత వెంటనే శక్తిని పుంజుకుంటారు. గంజి నీళ్లలో బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే కొంతమంది పసిపిల్లలు సరిగ్గా పాలు తాగరు. దీనివల్ల వారు బలహీనమైపోతారు. అందుకోసమే ఒకవేళ వారు సరిగ్గా పాలు తాగనట్లైతే కనీసం గంజినీటినైనా తాగించారు. ఇలాచేస్తే వారు కోల్పోయే విటమిన్స్, మినరల్స్‌ను తిరిగి పొందుతారు. విరేచనాలు వచ్చినప్పుడు చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఇలాంటి సమయాల్లో గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.

Comments