సీజన్ల వారిగా లభించే సీతా ఫలం పండ్లలో చాలా పోషకాలుంటాయి వాటి గురించి తెలుసుకుందామా...

కొన్ని పండ్లు ప్రత్యేకంగా కొన్ని సీజన్స్ లోనే అందుబాటులో ఉంటాయి. మామిడిపండ్లు వేసవిలో మాత్రమే దొరుకుతాయి. మిగతా కాలాల్లో ఎక్కడా మచ్చుకైనా మామిడిపండు కనిపించదు. అలాగే.. సీతాఫలాలు వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. 


సీజన్ల వారిగా లభించే పండ్లలో చాలా పోషకాలుంటాయి. సీతాఫలానికి ఆ పేరెలా వచ్చిందో గానీ.. పైకి పచ్చగా ఉండే ఈ పండు.. లోపల మాత్రం తెల్లని గుజ్జు.. నల్లటి గింజలతో.. రుచికి తియ్యగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ సీతాఫలాన్ని ఇష్టపడని వారుండరు.  సీతా ఫలంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లు ఎ, బి, కె, ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో లేదా బ్రేక్ ఫాస్ట్ చేశాక చాలామందికి పండ్లు తినే అలవాటుంటుంది. వాటితో పాటు సీతాఫలాన్ని కూడా తింటే.. శరీరానికి రోజంతా కావలసిన శక్తి లభిస్తుంది. 

వీటిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.అలాగే మెగ్నీషియం, సోడియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సీతాఫలాల్లో ఉండే ఇతర పోషకాలు చెడు కొవ్వును కరిగించి.. మంచి కొవ్వును పెంచుతాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు సీతా ఫలాన్ని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. అలాగే అనేమియా సమస్య ఉన్నవారు కూడా సీతా ఫలం తినాలి. సీతాఫలంలో ఉండే విటమిన్ బి6 కడుపు ఉబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. మెగ్నీషియం ఆర్థరైటిస్, రుమాటిజం లక్షణాలను నియంత్రిస్తుంది. క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. 100 గ్రాముల సీతాఫలాల్లో 94 క్యాలరీలు ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు సీతా ఫలాలను ఈ సీజన్ లో రెగ్యులర్ గా తినడం మంచిది.

Comments