రాత్రి సమయాల్లో గొర్రెలు దొంగిలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు

 నగరంతో పాటు శివారు ప్రాంతాలలో దొంగల భయం విపరీతంగా పెరిగింది.. ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలతో పాటు మొబైల్ ఫోన్ల చోరీలు, చైన్ స్నాచింగ్స్ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి.

 రాత్రి, పగలు అని తేడా లేకుండా కొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పక్క ప్లాన్ ప్రకారంగా రంగంలోకి దిగి అందినకాడికి దోచుకొని వెళ్తుంటారు. కాని దొంగలలో ఈ దొంగలు వేరు… ఇప్పటి వరకు చూసిన, చేసిన దొంగతనాలకు భిన్నంగా చేస్తారు. మొబైల్స్ ఫోన్స్, గొలుసు దొంగతనాలు. 


 

ఇళ్లలో చోరీలు రొటీన్ అనుకున్నారు ఏమో ఏకంగా మూగ జీవాలను టార్గెట్ చేశారు. అవును..ఆ ఊరిలో చీకటి పడుతుంది అంటే చాలు గొర్రెలు మాయం అవుతాయి. దీంతో ఫోకస్ పెట్టిన పోలీసులు గొర్రెల దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు

రాత్రి సమయాల్లో గొర్రెలు దొంగిలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రేగడి మామిడిపల్లిలో 20 గొర్రెలను దొంగిలించినట్టు చన్గోముల్ పోలీసు స్టేషన్లో రాములు అనే గొర్రెల కాపరి ఫిర్యాదు చేశాడు. ఆధారాలు, సిసి టివి ఫుటేజ్‌ల ఆధారంగా నేరస్థులను గుర్తించారు పోలీసులు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవన కొండ, యమ్నూరు,పెద్ద కడవూరుకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పదేళ్ళుగా వేర్వేరు రాష్ట్రాల్లో గొర్రెలను దొంగిలించి హైదరాబాద్లోని మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకుంటుంది ఈ ముఠా. పగటిపూట కూలి పనివారిగా గ్రామాల్లో సంచరిస్తూ గొర్రెల మందలను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

చోరీలకు పాల్పడుతున్న వారిలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారి వద్ద నుండి దొంగిలించబడ్డ 20 గొర్రెలు, 2 బొలేరో వాహనాలు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు… నిందితులను రిమాండుకు తరలించారు.

Comments