పండ్లు, కూరగాయల రసాల తాగడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెటావచ్చు..

కాలం ఏదైనా తినే ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం ద్వారా శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు లభించి, ఆరోగ్యం మెరుగు పడుతుంది. అయితే కొన్ని రకాల కూరగాయలు, పండ్లను నేరుగా తినకుండా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. ఫలితంగా వాటి ద్వారా లభించే శక్తి శరీర భాగాలకు త్వరగా చేరుతుంది.


 అలాగే శరీరం కూడా హైడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉంటుంది. ఇంకా వీటి నుంచి లభించే పోషకాలతో శరీరానికి ఎదురయ్యే అధిక బరువు, రక్తహీనత, డయాబెటీస్, గుండెపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ క్రమంలో మీరు ఏయే పండ్లు, కూరగాయల రసాలను తప్పనిసరిగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.  మన శరీరానికి కావాలసిన పోషకాలను అందించి, ఆరోగ్యానికి మేలు చేసేందుకు బీట్‌రూట్ జ్యూస్ మంచి ఎంపిక. ఇందులో మెగ్నీషియం, కాపర్, జింక్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్ రసంలో లభించే ఐరన్ మన శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. అలాగే ఇందులోని పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇంకా ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.  విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలమైన నిమ్మరసం శరీర రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ప్రోటీన్, ఫోలేట్, మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే బరువు తగ్గడంలో నిమ్మరసం మెరుగ్గా పనిచేస్తుంది. 

టమాటాలు కూడా ఆరోగ్యానికి మంచివే. ఈ టమాటాల్లో లభించే విటమిన్ కె, ఐరన్, ఫైబర్, విటమిన్ ఎ, ఫాస్పరస్, మెగ్నీషియం మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇందులోని విటమిన్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టమాటాల్లోని ఐరన్ శరీరంలో రక్తహీనత సమస్యను నివారిస్తుంది. అలాగే ఫాస్పరస్ పటిష్టమైన ఎముకల నిర్మాణానికి దోహదపడుతుంది.  పుచ్చకాయలో నీటి పరిమాణం 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే పుచ్చకాయ రసం మంచి ఎంపిక. పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే డ్రీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్‌కి కూడా మంచి మూలమైన పుచ్చకాయ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణ సమ్యలను దూరం చేస్తుంది. అలాగే బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  కాకరకాయ రసం చేదుగా ఉన్నా అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్లు, పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Comments