బాసుమతిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు గురించి తెలుసుకుందామా...

 అన్నమే కదా.. ఏదైతే ఏంటి? అని అనుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా సన్నబియ్యం కంటే బాసుమతి బియ్యం ధర ఎక్కువే. కేజీ రూ.120 నుంచి రూ.150 వరకూ ఉంటుంది. ఈ ధరతో నార్మల్ రైస్ మూడు కేజీలు వస్తాయి. కానీ బాసుమతిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఇతర బియ్యాల్లో ఉండవు. 


వీటిలో 210 క్యాలరీల శక్తి, 0.5 శాతం కొవ్వు, 46 గ్రాముల పిండిపదార్థాలు, 0.7 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల ప్రొటీన్, విటమిన్లు బి1, బి6, రాగి, ఫొలేట్, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి. పోషకాలు శరీరానికి అందుతాయి. బాసుమతిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి.. డైట్ చేసేవారు ఈ బియ్యంతో వండిన ఆహారాన్ని తినడమే మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా బాసుమతి అన్నాన్ని హ్యాపీగా తినొచ్చు. బాసుమతి/ బాస్మతీ రైస్. భారతీయ వంటకాల్లో ఈ రైస్ ను ఎక్కువగా బిర్యానీ, పులావ్ వంటి వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణ బియ్యం కంటే.. బాసుమతి కొంచెం పొడవుగా, సన్నగా.. మంచి వాసనను కూడా కలిగి ఉంటాయి. బాసుమతి బియ్యంతో చేసిన వంటకాలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే వీటితో ఎక్కువగా బిర్యానీ, పులావ్ చేస్తూంటారు. మనదేశంలో 29 రకాల బాసుమతి బియ్యం ఉత్పత్తి జరుగుతుంది. వీటిని ఎగుమతి చేయడంలో భారతదేశమే ముందంజలో ఉంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రకం బియ్యాన్ని పండిస్తారు. 

రోజూ మామూలు అన్నంకు బదులు బాసుమతి బియ్యంతో వండిన అన్నం తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాసుమతి అన్నం తినడం వల్ల గుండె జబ్బులొచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నాడీ సంబంధిత సమస్యలు రావు. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గడంలో, శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలో కూడా బాస్మతి రైస్ మనకు సహాయపడుతుంది. 

అయితే ఈ ప్రయోజనాలన్నీ పాలిష్ పట్టని బాసుమతి బియ్యం ద్వారానే పొందగలమని నిపుణులు పేర్కొన్నారు. అందుకే ఈ బాస్మతి రైస్ ని మీరు ఉపయోగించాలనుకుంటే.. పాత బాస్మతి బియ్యాన్ని తీసుకోవడం బెటర్.

Comments