మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే మెడిసిన్ అంటూ ఓ టాబ్లెట్ వేస్తున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు, పదే పదే టాబ్లెట్లను తీసుకోవడం వల్ల శరీరంలో మెడిసిన్ డోస్ ఎక్కువై మరిన్నీ సమస్యలకు దారితీస్తుంది.
ఇలాంటి సమస్యలను క్షణంలో నయం చేసుకునేందుకే ప్రకృతి మనకు ఎన్నో రకాల వనమూలికలను ప్రసాదించింది. కానీ వాటిపై సరైన అవగాహన లేక ప్రయోజనాలను పొందలేకపోతున్నాం. అయితే ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలున్న అనేక మొక్కల్లో ఉత్తరేణి కూడా ఒకటి. చూడడానికి ముళ్లతో ఉన్నట్లు కనిపించే ఈ ఉత్తరేణి మొక్కలో ప్రతి భాగం ఆరోగ్యానికి మంచిదే. సరిగ్గా ఉపయోగించుకుంటే అన్ని రకాల సమస్యల నుంచి బయట పడొచ్చు. ఈ క్రమంలో ఈ ఉత్తరేణి మొక్క ప్రయోజనాలు, దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఉత్తరేణి వేరు దంత సమస్యలను నయం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీని వేర్లతో దంతాలను శుభ్రం చేసుకుంటే పిప్పి పన్ను నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పసుపు దంతాలు, దంతాల పగుళ్లు తొలగిపోతాయి. ఉత్తరేణి మొక్క వేర్లను ఎండబెట్టి పొడిలా చేసుకుని ముఖానికి రాసుకుంటే చాలు, చర్మంపై మొటిమలు, మచ్చలు, ముఖంపై ఉండే గుంతలు మాయమైపోతాయి. అలాగే ముఖంపై ముడతలు తొలగి నవయవ్వనంగా కనిపిస్తారు.
అలాగే దురద, దద్దుర్లు ఉన్నవారు ఉత్తరేణి ఆకుల పసరను చర్మంపై రాసుకుంటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊభకాయం అనేది సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్యతో బాధపడేవారు ఉత్తరేణి వేర్లను నీటిలో వేసి మరిగించి, వారంలో రెండు సార్లు తాగితే చాలు. నమశక్యం కాని రీతిలో బరువు, ఊభకాయం నుంచి బయటపడతారు. నెలసరి సమయంలో మహిళలకు ఎదురయ్యే కడుపు నొప్పికి కూడా ఉత్తరేణి చక్కని పరిష్కారం. ఆవుపాలు, ఉత్తరేణి ఆకు రసం కలిపి తాగితే నొప్పి తగ్గుతుంది. ఇంకా మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉంటాయి.ఉత్తరేణి మొక్కకు గాయలను మాన్పగల శక్తి కూడా ఉంది. ఇందుకోసం మీరు నువ్వుల నూనెలో ఉత్తరేణి వేర్లను వేసి మరగించి, గాయలపై రాస్తే అవి మాయమైపోతాయి.కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా ఉత్తరేణి మొక్కలను ఉపయోగించవచ్చు. అందుకోసం వీటి ఆకులను కషాయంగా తీసుకుంటే సరిపోతుంది.
Comments
Post a Comment