పొద్దుతిరుగుడు విత్తనాల ప్రయోజనాలు : రోజూ గుప్పెడు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే ఎన్ని పోషకాలో!!

 పొద్దుతిరుగుడు పువ్వుల గురించి తెలియని వారుండరు. అలాగే పొద్దుతిరుగుడు పువ్వుల నుంచి తీసిన ఆయిల్ తో మనం అనేక రకాల వంటలను తయారు చేసుకుంటుంటాం. సన్ ఫ్లవర్ ఆయిల్ కంటే.. సన్ ఫ్లవర్ సీడ్స్ ను తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


వీటిని డైరెక్ట్ గా తినడం కంటే.. వేయించి లేదా.. నీటిలో నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిది. ఎన్నో పోషకాలుండే సన్ ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.ఒక పావుకప్పు సన్ ఫ్లవర్ సీడ్స్ లో 205 క్యాలరీల శక్తి ఉంటుంది. వీటిలో ప్రొటీన్ 5.7గ్రా, కొవ్వు 18గ్రా, కార్బోహైడ్రేట్లు 7 గ్రా, ఫైబర్ 4 గ్రాములు ఉంటాయి. అలాగే విటమిన్ B1, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6, విటమిన్ E, ఐరన్, కాపర్, ఫోలేట్స్, సెలీనియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్, మాంగనీస్, పొటాషియం వంటి అనేక ఖనిజాలు, లవణాలు ఉంటాయి.రోజూ ఒక గుప్పెడు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే.. బీపీ కంట్రోల్ అవుతుంది. గుండెజబ్బులు త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ఫోలేట్స్ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచుతుంది.

శరీరంలో వాపు, మంట నుంచి ఉపశమనం ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ E ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో తోడ్పడుతాయి.సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే జింక్, సెలీనియం వంటి పోషకాలు, ఖనిజ లవణాలు రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు, ఇమ్యూనిటీని పెంచేందుకు సెలీనియం అద్భుతశక్తిగా పనిచేస్తుంది.థయామిన్ గా పిలిచే విటమిన్ B1 శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చి.. నీరసాన్ని, అలసటను తగ్గిస్తుంది.సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే హెల్దీ కొలెస్ట్రాల్.. శరీరంలో పేరుకున్న చెడు కొవ్వును కరిగించి.. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. తరచూ గుండెజబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.

Comments