బీరకాయ ప్రయోజనాలు : బీరకాయ తింటే ఎన్నిరోగాలకు చెక్ పెట్టొచ్చో తెలిస్తే.. తినని వారు కూడా తినేస్తారు!!

 రోజూ ఆహారంగా తినే కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా బాలింతలకు పెడుతుంటారు. పాలిచ్చే తల్లులు బీరకాయలు తినాలని వైద్యులు కూడా చెబుతారు. బీరకాయలతో కూర, పప్పు, పచ్చడి ఇలా రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటుంటాం. 


కానీ.. కొందరు బీరకాయల్ని తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారికోసమే ఇది. బీరకాయల్లో శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్స్, విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.వారానికి రెండుసార్లైనా బీరకాయల్ని తింటే.. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి శరీరంలో వేడిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతాయి. అలాగే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని కంట్రోల్ లో ఉంచుతుంది. బీరకాయల్లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సరిచేసి.. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. బీరకాయ రుచికి తియ్యగా ఉంటుంది కాబట్టి.. పచ్చివి కూడా తినొచ్చు. అధిక బరువు ఉన్నవారు సైతం బీరకాయల్ని తినొచ్చు. ఇవి లో కేలరీ ఫుడ్ కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. బాలింతలు బీరకాయల్ని తినడం వల్ల పిల్లలకు పాలు ఎక్కువగా వస్తాయి. బీరకాయల ఆకు రసం తాగడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. ఇక కామెర్ల వ్యాధి చికిత్సకు కూడా బీరకాయ అద్భుతంగా పని చేస్తుంది. కొద్ది రోజుల పాటు డైలీ బీరాకు రసం తాగితే కామెర్లు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. అలాగే బీరకాయలో సెల్యులోజ్, నీటి శాతం అధికంగా ఉంటాయి. 

కాబట్టి ఫైల్స్ తో బాధపడే వారు ఇది తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. బీరకాయ ముఖ్యంగా విటమిన్ బి6 అనీమియాను నివారించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. బీరకాయను తరచుగా తింటే చర్మం కూడా కాంతివంతంగా తయారై నిగనిగలాడుతూ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు కూ చెక్ పెడుతుంది బీరకాయ. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చాలా మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతూంటారు.. అలాంటి వారికి బీరకాయ బాగా పని చేస్తుంది. బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది.

Comments