కల్యాణ్‌ దెబ్బతిన్న పులి.. సీఎం అయినా సినిమాలు చేయాలి: పరుచూరి గోపాల కృష్ణ

 రాజకీయాల్లో వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తారు. పవన్‌ కల్యాణ్‌ కూడా అలాగే విజయం సాధించాలని కోరుకుంటున్నా.

 


సమాజం మారాలని తపించే అతి కొద్ది మంది వ్యక్తుల్లో పవన్‌ ఒకరు. కాబట్టి ఆయన కోరుకున్నది ఆయనకు దక్కాలని ఆకాంక్షిస్తున్నాను. రాజకీయాల్లో బిజీ అయినా పవన్‌ సినిమాలు చేయడం మానకూడదు. టాలీవుడ్ పవర్‌ స్టార్‌, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ గురించి ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ సినిమాలు, రాజకీయాలపై తన అభిప్రాయలను పంచుకున్నారు. అలాగే పవర్‌ స్టార్‌ వ్యక్తిత్వం, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రసంగాల గురించి కూడా మాట్లాడారు. ‘ పవన్ కల్యాణ్‌ బాగుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. సమాజం గురించి రాజకీయ నాయకులు చెబితే వినే వారికంటే.. ఒక సినిమా నటుడు చెబితే ఆసక్తిగా వినేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు. అలాగే సమాజం మారాలంటే అధికారం కూడా చేతులు మారాలి. ఒకరి చేతుల్లోనే అధికారం బంధీ కాకూడదు. 

ఇది పవన్‌కి బాగా తెలుసు. అందుకే గత ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో పవన్‌ ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఆ ఫలితాలతో నిరాశచెందుకుండా దెబ్బతిన్న పులిలా మళ్లీ వస్తున్నాడు. ఓటింగ్‌ అనేది ఒక పెద్ద రాజకీయ తంత్రం. రాజకీయాల్లో వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తారు. పవన్‌ కల్యాణ్‌ కూడా అలాగే విజయం సాధించాలని కోరుకుంటున్నా. సమాజం మారాలని తపించే అతి కొద్ది మంది వ్యక్తుల్లో పవన్‌ ఒకరు. కాబట్టి ఆయన కోరుకున్నది ఆయనకు దక్కాలని ఆకాంక్షిస్తున్నాను. రాజకీయాల్లో బిజీ అయినా పవన్‌ సినిమాలు చేయడం మానకూడదు. సమయం లేకపోతే కనీసం ఎన్టీఆర్‌ లాగా అప్పుడప్పుడైనా సినిమాల్లో కనిపించాలి’ అని పరుచూరి పేర్కొన్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ నటించిన బ్రో సినిమాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారీ టాలీవుడ్‌ సీనియర్‌ రచయిత. ‘ బ్రో సినిమా గురించి తెలియగానే షాక్ అయ్యాను. సాయి ధరమ్‌ తేజ్‌, పవన్ కల్యాణ్ కలిసి నటించడం ఏంటని అనుకున్నాను. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమోషన్‌ కోసం పవన్‌ ఈ సినిమా చేశారని పించింది. పవన్‌ సినిమాల్లో మాత్రమే కొనసాగితే.. మరో పదేళ్లకు ఎన్టీఆర్‌, మెగాస్టార్‌ చిరంజీవి లాగా ఎదుగుతారు. 

త్వరలోనే బ్రో సినిమా చూస్తాను. తర్వాత తన అభిప్రాయాలు పంచుకుంటాను. ప్రేక్షకులంతా ఈ మంచి సినిమాను చూడాలి’ అని తన మనోగతంలో పేర్కొన్నారు పరుచూరి గోపాల కృష్ణ. టాలీవుడ్‌లో పలు సూపర్‌హిట్‌ సినిమాలకు పనిచేసిన పరుచూరి నటుడిగానూ సత్తా చాటారు. ప్రస్తుతం ‘పరుచూరి పలుకులు’ అంటూ తెలుగు సినిమాలపై తన అభిప్రాయలను పంచుకుంటున్నారు.

Comments