ఈ ఆకుకూరలు తినడం వల్ల ఎముకలు గట్టి పడటానికి సహాయపడతాయో తెలుసుకుందాం...

 ఎముకలు దృఢంగా ఉంటేనే.. మన లోపలున్న అస్థిపంజరం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎముకల ఆరోగ్యం ఎంత బాగుంటే.. మనం కూడా అంత బాగుంటాం. మరి ఎముకలు పటిష్టంగా ఉండాలంటే.. క్యాల్షియం, విటమిన్ డి ఎంతో అవసరం. ఇవి రెండు ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం.


 వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం కూడా అంతే అవసరం. వ్యాయామం చేయకపోతే.. శరీరంలో కదలికలు లేక ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్నచిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది. మీకు విటమిన్ డి లోపం ఉందని తెలిస్తే.. ఉదయాన్నే వచ్చే ఎండలో ఉండాలి. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తింటూ ఉండాలి.ఈ ఆకుకూరలు ఎముకలు గట్టి పడటానికి సహాయపడతాయి: ముఖ్యంగా ఆకు కూరల్లో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. కనీసం వారానికి రెండు, మూడు సార్లైనా మీ డైట్ లో ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. తోట కూర, పొన్న గంటి కూర, మునగాకు, మెంతి కూర, కరివేపాకు వంటి ఆకు కూరల్లో కాల్షియం ఎక్కువగా లభించింది. వీటిలో ఎముకల ఆరోగ్యానికి కావలసిన క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి, కె వంటి పోషకాలు అందుతాయి. 

ఎముకలతో పాటు కంటి ఆరోగ్యానికి కూడా ఆకుకూరలు మేలు చేస్తాయి. కాబట్టి ఆకుకూరలు తిన్నా వాటివల్ల ఉపయోగాలే తప్ప.. హాని జరిగేదేమీ ఉండదు. క్రమం తప్ప కుండా వ్యాయామాలు చేయాలి:అలాగే ఎముకలు ధృడంగా ఉండేందుకు వ్యాయామం కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ వ్యాయామం చేస్తే కండరాలలో కదలికలు వచ్చి.. నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింప చేయడంలో సహాయ పడుతుంది. ఫలితంగా ఎముకల కణజాలానికి రక్త ప్రసరణ జరగడంతో పాటు.. వాటికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. అందుకే రోజుకి గంట నుంచి రెండు గంటల పాటు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల జీర్ణశక్తి పెరిగి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. మీ శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో తెలియాలంటే విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి.

Comments