దొండకాయ చిట్కాలు : దొండకాయలా అని వదిలేస్తున్నారా? కానీ దీంతో అద్భుత ప్రయోజనాలున్నాయ్!!

 చాలా మంది ఒక అపోహతో దొండకాయలను తినరు. దొండకాయలు తింటే మందబుద్ధి పెరుగుతుందని కొందరి అపోహ. కానీ.. దొండకాయలు తినడం వల్ల చాలా ఆరోగ్య లాభాలున్నాయి. వండుకునే తినక్కర్లేదు. పరగడుపునే 30 ఎంఎల్ దొండకాయ జ్యూస్ తాగినా చాలు. 


వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి.. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. ఫలితంగా రోజంతా హ్యాపీగా.. హుషారుగా పనిచేసుకుంటారు. ఇంకా దొండకాయలు తినడం వల్ల ఏమేం ప్రయోజనాలున్నాయో చూద్దాం. దొండకాయల జ్యూస్ ను రోజూ తాగితే.. పేగులు, జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. గ్యాస్ సమస్య తగ్గి.. కడుపులో మంట కూడా తగ్గుతుంది. దొండకాయల్లో ఉండే విటమిన్ సి.. చర్మాన్ని సంరక్షించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత సమస్యకు దొండకాయలు మంచి  ఆహారం. దొండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి కాపాడుతాయి. అంతేకాదు.. అధికబరువు ఉన్నవారు దొండకాయలను డైట్ లో తీసుకుంటే.. బరువు కూడా తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్తసరఫరా మెరుగు పడుతుంది. వాపులు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వారానికి రెండుసార్లైనా దొండకాయ కర్రీ తినడం వల్ల ఇలా ఆరోగ్యపరంగా చాలా మేలు జరుగుతుంది.

Comments