ఆరోగ్య చిట్కాలు : ఖాళీ కడుపుతో ఏ పండ్లు తింటే ప్రయోజనం కలుగుతుందో తెలుసా? కీలకమైన సమాచారం మీకోసం..

 ప్రస్తుత కాలంలో ఫిట్‌గా ఉండటం అనేది చాలా పెద్ద టాస్క్. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలితో పాటు.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. సరైన పండ్లు, కూరగాయలు తినాలి. పండ్లు, మంచి కూరగాయలు తినడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


ఉదయాన్నే పండ్లు తినడం వలన రోజంతా చురుకుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏ పండ్లు తినాలి? ఏం తింటే మంచిది? అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఉదయాన్నే ఏం పండ్లు తింటే మేలు జరుగుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం..పండ్లు తినడానికి సరైన సమయం ఏది?ఖాళీ కడుపుతో తినే పండ్లు కొన్ని ఉన్నాయి. వీటిని అల్పాహారం, మధ్యాహ్న భోజనం మధ్య సమయంలో అంటే ఉదయం 10 నుండి 12 గంటల మధ్య కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పండ్లను ఉదయం సమయంలో తినాలి. తద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఖాళీ కడుపుతో తినవలసిన పండ్లు :  కివి: ఈ పండ్లలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిని ఖాళీ కడుపుతో తినొచ్చు. డెంగ్యూ బారిన పడిన వారికి కివి చాలా మంచిది. దీని వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండి శరీరానికి శక్తి అందుతుంది. ఆపిల్: ఖాళీ కడుపుతో ఆపిల్ పండ్లను కూడా తినవచ్చు. దీని వల్ల బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు శరీరంలో పోషకాల కొరత కూడా తీరుతుంది. మలబద్ధకం, సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది.దానిమ్మ: ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో దానిమ్మ పండ్లను తినడం వలన ప్రయోజనం ఉంటుంది. దానిమ్మ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.బొప్పాయి: బొప్పాయి తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. బరువు అదుపులో ఉండాలంటే బొప్పాయి ఉత్తమం. అలాగే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Comments