కరివేపాకును టీ చేయడానికి కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట...

 వండేటప్పుడు నాలుగు కరివేపాకులను వేస్తే ఆ పదార్ధానికి రుచి పెరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైనా కరివేపాకు టీ తాగారా..? అసలు దాని గురించి ఎప్పుడైనా విన్నారా..? శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించే డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియకూ కరివేపాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.


ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌లా కూడా పనిచేస్తుంది. జీర్ణ కోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికీ ఎంతో సాయపడుతుంది. ఇంతకీ ఈ టీ ఎలా తయారు చేయాలి.. ఆలస్యం ఎందుకు తెలుసుకుందాం పదండి. సాధారణంగా కరివేపాకును వంట పదార్థాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కరిపేపాకును సౌత్ ఇండియాలోనే ఎక్కువగా వినియోగిస్తారు. దక్షిణాదిలో చాలా మంది ఫిట్‌నెస్ కోసం కరివేపాకు జ్యూస్ తాగుతుంటారు. అయితే కరివేపాకును టీ చేయడానికి కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?. అవునుండీ బాబు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఈ టీ అనేక రకాల శారీరక సమస్యల నుండి రక్షిస్తుంది. కరివేపాకులో ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ ఏ, కెరోటిన్, విటమిన్ సి మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కరివేపాకు టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. 

ఈ టీ ఫ్రీ రాడికల్స్‌ను రిమూవ్ చేస్తుంది. చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. కరివేపాకు మంచి స్థాయిలో ఫినోలిక్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు మన బాడీని ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ నుండి రక్షించడంలో సహకారం అందిస్తాయి. కరివేపాకులో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలు ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకుతో చేసిన టీ తాగవచ్చు. ఇది డైజీషన్ ఎంజైమ్‌లను కలిగి ఉన్నందున ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ టీ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటివి నయమవుతాయి.   గ్యాస్, మూత్ర విరేచనాల నుంచి ఉపశమనం కలుగుతుంది. గర్భధారణ సమయంలో టీ తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కరివేపాకు సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. 

రోజంతా బాగా అలసిపోతే సాయంత్రం పూట ఒక కప్పు కరివేపాకు టీ తాగడం వల్ల అద్భుతమైన రిలాక్సేషన్ లభిస్తుంది. మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మీరు దాని టీని త్రాగవచ్చు. ఇందులో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ ఉంటుంది. స్కిన్‌పై మంట లేదా ఇన్‌ఫెక్షన్ రాకుండా కరివేపాకు టీ ఉపయోగపడుతుంది. కరివేపాకు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలసుకుందాం. 20 నుండి 30 కరివేపాకులను తీసుకుని శుభ్రంగా కడగండి. ఆపై ఒక గ్లాసు నీటిలో మరిగించి, నీరు సగం కాగానే వడకట్టాలి. ఆపై కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ప్రతిరోజూ కరివేపాకు టీ తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇంకెందుకు ఆలస్యం ఈ టీని మీ డైలీ రొటిన్‌లో భాగం చేసెయ్యండి. 

Comments