బ్లూ బెర్రీస్ తినడం వల్ల జ్ణాపక శక్తి మాత్రమే కాదు స్కిన్ కూడా చాలా షైనీ ఉంటుందన్న విషయం మీకు తెలుసా...

 పండ్లలో బ్లూ బెర్రీస్ ఒకటి. బ్లూబెర్రీ చిన్నగా, నీలం రంగులో, గుండ్రంగా ఉంటాయి. దీనికి మరో పేరు కూడా ఉంది. అదే నీలబదరి. వీటి గురించి చాలా మందికి తెలుసు. అయితే ఫ్రూట్స్ రుచి మాత్రం అంత టేస్టీగా ఉండదు. అందుకే దీనిక జోలికి వెళ్లారు. ఒక్కో పండుకు కొన్ని ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉంటాయి.


 బ్లూబెర్రీస్ అత్యంత పోషకమైన వాటిలో ఒకటిగా నిపుణులు పరిగణించారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే జ్ణాపక శక్తి మాత్రమే కాదు స్కిన్ కూడా చాలా షైనీ ఉంటుందన్న విషయం మీకు తెలుసా. నిజానికి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే స్కిన్ షైనీగా, ఫ్రెష్ గా ఉంటుంది. బ్లూబెర్రీస్ లో ఉండే సాలిసిలిక్ యాసిడ్.. చర్మంపై మొటిమల సమస్యను తగ్గిస్తుంది. వీటి వల్ల బీపీనే కాదు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇంకెందుకు లేట్.. మరి వీటి గురించి తెలుసుకుందామా.  బ్లూబెర్రీస్ లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వలన చర్మంపై వృద్దాప్య ఛాయలు కనిపించవు. దీంతో యంగ్ గా ఉంటారు. అలాగే బ్లూబెర్రీస్ లో విటమిన్ ఎ, సి, ఇలు కాలుష్యం నుంచి చర్మానికి రక్షణగా ఉంటాయి. 

కాబట్టి ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల స్కిన్ షైనీగా, ఫ్రెష్ గా ఉంటుంది. వీటిని ముఖానికి పేస్ట్ లా కూడా చేసుకుని రాసుకోవచ్చు. బ్లూబెర్రీస్ లో ఉండే విటమిన్స్ ఎ, సి, ఇల వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో చెడు బ్యాక్టీరియాతో పోరాడే శక్తి మనకు లభిస్తుంది. బెర్రీస్ లో ఆంథోసైనిన్స్ ఉంటాయి కాబట్టి.. దీర్ఘకాలి వ్యాధులను నివారిస్తుంది. బ్లూబెర్రీస్ లో ఉండే ఫ్లవనాయిడ్స్ కారణంగా మెదడు చురుకుగా వ్యవహరిస్తుంది. దీంతో మెదడు కణాలను దెబ్బతినడకుండా రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది .బ్లూబెర్రీస్ లో నీరు, ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కొన్ని తిన్నా కడుపు నిండుగా కలిగిన భావన కలుగుతుంది. అలాగే కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

Comments