భోలా శంకర్ : ఏపీలో భోళాశంకర్‌పై కొనసాగుతోన్న ఉత్కంఠ.. అనుమతికి అవి లేవంటోన్న ప్రభుత్వం

 తగిన పత్రాలను సమర్పిస్తే టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా బడ్జెట్‌ కనీసం రూ. 100 కోట్లు దాటితో టికెట్‌ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనికి బదులిచ్చిన చిత్ర యూనిట్ రెమ్యునరేషన్‌ కాకుండా సినిమా కోసం రూ. 101 కోట్లు ఖర్చు చేశామని బదులిచ్చింది. 


అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అనుతమికి కావాల్సి 11 డాక్యుమెంట్లను చిత్ర యూనిట్ అందించలేదని చెబుతోంది. దీంతో ఇప్పుడీ అంశం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. రాజకీయ వేడి నేపథ్యంలో టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. చిరంజీవి హీరోగా తెరకెక్కి తాజా చిత్రం భోళా శంకర్‌. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని శుక్రవారం (రేపు) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విడుదలకు అంతా సిద్ధమైంది. అయితే తాజాగా భోళా శంకర్ సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

సినిమా బడ్జెట్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వాన్ని అనుతమి కోరిన విషయం తెలిసిందే. అయితే ధరలు పెంచాలంటే చిత్ర నిర్మాణ వ్యయానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని ప్రభుత్వం సినిమా యూనిట్‌ను కోరింది. తగిన పత్రాలను సమర్పిస్తే టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా బడ్జెట్‌ కనీసం రూ. 100 కోట్లు దాటితో టికెట్‌ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనికి బదులిచ్చిన చిత్ర యూనిట్ రెమ్యునరేషన్‌ కాకుండా సినిమా కోసం రూ. 101 కోట్లు ఖర్చు చేశామని బదులిచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అనుతమికి కావాల్సి 11 డాక్యుమెంట్లను చిత్ర యూనిట్ అందించలేదని చెబుతోంది. దీంతో ఇప్పుడీ అంశం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. రాజకీయ వేడి నేపథ్యంలో టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

భోళాశంకర్‌ను వెంటాడుతోన్న మరో వివాదం.. ఓవైపు టికెట్ల ధరలకు సంబంధించిన అంశం చిత్ర యూనిట్‌ను వెంటాడుతుంటే మరోవైపు భోళాశంకర్‌ ప్రొడ్యూసర్స్‌ చుట్టూ వివాదం నెలకొంది. భోళా శంకర్‌ నిర్మాతలు తమను ఏజెంట్ సినిమా సమయంలో మోసం చేశారని పిటిషన్‌ దాఖలైంది. గాయిత్రి దేవి ఫిల్మ్స్ సంస్థ యజమాని సత్యనారాయణ హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ రూ. 30 కోట్లు ఇవ్వాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమా విడులకు 15రోజుల ముందు ఇస్తామని మోసం చేశారని పిటీషనర్‌ కోర్టకు తెలిపారు. సినిమా విడుదల నిలిపేయాలని వేసిన పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. 

సినిమా విడుదలపై కోర్డు ఈరోజు తీర్పునివ్వనుంది. దీంతో కోర్ట్‌ ఎలాంటి తీర్పునివ్వనుందన్నదానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేశ్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జోడిగా తమన్నా నటిస్తోంది. వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తోన్న భోళా శంకర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Comments