ABC జ్యూస్‌ ప్రయోజనాలు తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు...

 A ఫర్ యాపిల్, B ఫర్ బీట్రూట్, C ఫర్ క్యారెట్ - ABC జ్యూస్‌ ప్రయోజనాలు తెలిస్తే నిజంగా మీరు స్టన్ అవుతారు. మంచి టేస్ట్ ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. స్కిన్ గ్లో వస్తుంది. బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ జ్యూస్ దివ్యౌషధం. ఇందులో ఉండే విటమిన్ A వల్ల ఈ కాంబినేషన్ కళ్ళకి కూడా ఉపయోగం. 


ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం వల్ల వచ్చే కళ్లు పొడిబారడం వంటి సమస్యని దూరం చేస్తుంది. ఇక జ్యూస్ చేయడం కూడా చాలా సింపుల్.. అదెలానో తెలుసుకుందాం పదండి. ప్రజంట్ అంతా స్పీడ్ జనరేషన్. కంప్యూటర్ యుగం. నిమిషాల్లో పనులు అయిపోవాలి. అంతా మనం కూర్చున్న వద్దకే రావాలి. విపరీతమైన పని ఒత్తిడి.. దానికి తోడు ఆందోళన ఇవన్నీ కలిసి.. మనుషులను అనేక రోగాల దిశగా నడిపిస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో మనకి ముఖ్యంగా మంచి లైఫ్ స్టైల్, డైట్ అవసరం. తినే, తాగే ప్రతిదానిపై జాగ్రత్త వహించాలి. ఈ క్రమంలోనే మీకు ఇప్పుడు అద్భుతమైన ABC జ్యూస్ గురించి చెప్పబోతున్నాం. అంటే యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ మిశ్రమమే ఈ జ్యూస్. ఇది అనేక రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది.  దీన్ని రోజుకు ఒకటి తాగితే చాలు.. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఉదయాన్నే ఒక ABC జ్యూస్ తాగితే మీకు తిరుగు లేనట్లే. 

ఈ జ్యూస్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు మీ ఫేస్ కూడా కాంతివంతంగా వెలిగిపోతుంది. పోషకాల పవర్‌హౌస్: ABC జ్యూస్‌లో విటమిన్లు A,  Cలు పుష్కలంగా ఉన్నాయి. యాపిల్‌లోని శక్తి , బీట్‌రూట్‌లోని ఐరన్, పొటాషియం.. క్యారెట్‌లోని బీటా-కెరోటిన్‌తో  కలగలిపి ఈ జ్యూస్ చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. యాపిల్‌లోని సహజ చక్కెర లక్షణాలు, ABCలోని హైడ్రేటింగ్ లక్షణాలు.. రోజంతా మీరు యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. యాపిల్స్, క్యారెట్‌లలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. అదనంగా, బీట్‌రూట్‌లో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయి. లోపలి టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి. కాబట్టి జీర్ణక్రియ అంతా సాఫీగా జరుగుతంది.ABC జ్యూస్‌లోని అధిక విటమిన్ సి కంటెంట్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  యాంటీఆక్సిడెంట్‌లతో పాటు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. వ్యాధులను దూరం చేస్తుంది.  ABC జ్యూస్‌లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.  మీ శరీర కణాలను రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం,  జుట్టు కోసం ఈ జ్యూస్ సాయపడుతుంది. 

పింపుల్స్, బ్లాక్ హెడ్స్, బ్లాక్ స్పాట్స్ వంటి వాటికి చెక్ పెట్టవచ్చు. ఈ జ్యూస్ కొన్ని రోజుల పాటు తాగితే ముఖం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది.గుండె జబ్బులు దూరం: ABC జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్‌ని అదుపులో ఉంచి.. గుండెకు మేలు చేస్తుంది ఈ జ్యూస్.తయారీ విధానం :300 గ్రాముల క్యారెట్, 300 గ్రాముల బీట్రూట్, 100 గ్రాముల యాపిల్స్‌, ఒక చిన్న అల్లం ముక్క వేసి జ్యూస్ చేయండి. అందులో ఒక అర చెక్క నిమ్మరసం పిండి తాగేయండి.

Comments