వంటగది చిట్కాలు : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేసుకోండి సూపర్ అంతే!!

 వర్షాకాలంలో, శీతాకాలంలో వేడి వేడిగా ఏమాన్నా తినాలి, తాగాలి అనిపిస్తుంది. అయితే చలికి కాస్త బద్ధకంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈజీగా, ఫాస్ట్ గా అవ్వాలి. అలాంటప్పుడు సూప్ లు గుర్తొస్తాయి. 


బయటకు వెళ్లి అంతంత రేటు పెట్టే బదులు.. ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీకి టేస్ట్ ఉంటుంది.ఎప్పుడూ కూరగాయలతో కాకుండా ఈ సారి చికెన్ స్వీట్ కార్న్ సూప్ ట్రై చేయండి. ఇది తయారు చేయడం కూడా ఈజీనే. జ్వరంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు వీటిని తాగుతూ ఉంటే ఉపశమనం లభిస్తుంది. మరి చికెన్ స్వీట్ కార్న్ సూప్ ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేయు విధానం తెలుసుకుందాం.

సూప్ కి కావాల్సిన పదార్థాలు:1. చికెన్ (బోన్ ఆర్ బోన్ లెస్ చికెన్ ని తీసుకోవచ్చు) 2. క్యారెట్ 3. క్యాబేజ్ 4. స్వీట్ కార్న్ 5. పెప్పర్ పౌడర్ 6. చిల్లీ పౌడర్ 7. కార్న్ ఫ్లోర్ 8. ఉప్పు 9. మిరియాల పొడి 10. నూనె

తయారు చేయు విధానం:  1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు, పసుపు వేసి చికెన్ వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆతర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. 

2. ఆ తర్వాత మరో సాస్ పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజ్ మరియు క్యారెట్ ముక్కలు వేయాలి. 

3. అవి బాగా వేగాక రెండు లీటర్ల నీళ్లు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.

 4. ఇప్పుడు ఆ నీటిలో పెప్పర్ పౌడర్,చిల్లీ పౌడర్ వేయాలి.

 5. 10 నిమిషాలు బాగా బాయిల్ అయ్యాక అందులో చికెన్ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 

6. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీరు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. దీన్ని పా న్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. 

7. ఈ మొత్తాన్ని 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ.

Comments