ఎలైచి ప్రయోజనాలు : యాలకుల గురించి మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ నిజాలు

 యాలకులు.. ఒక్కసారిగా మనం వండిన టేస్ట్ ని, వాసనను మార్చేస్తాయి. సాధారణంగా వీటిని మనం టీలో, పాయసం, పరమాన్నం, బాదం మిల్క్, మసాలాలు, బిర్యానీ, పలు రాకల స్వీట్లలో ఇలా వాడుతూంటాం. ఇవి మంచి సుమాసనను, రుచిని అందిస్తాయి. అయితే యాలకులలో చాలా ఆరోగ్య రహస్యాలున్నాయి. 


వీటికి చాలా చరిత్ర కూడా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మంచినవి లేవంటే నమ్మండి.మనం దేశం సుగంధ ద్యవ్యాలకు బాగా ప్రసిద్ధి.. ఇక్కడ అన్నింటికన్నా ఖరీదైనది కుంకుమపువ్వు. ఆ తర్వాత ప్లేస్ యాలకులదే. మసాలద్రవ్యాల రారాణి అని యాలకులను అంటూంటారు. అంటే యాలకులకు అంత విశేష ఔషధగుణాలున్నాయి. మరి యాలకుల వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా. యాలకులను సాధారణంగా మనం ఆకుపచ్చ రంగులోని చూసి ఉంటాం. నల్ల యాలకులు కూడా చాలా మంది చూసి ఉంటారు. అయితే వీటిని కాస్త తక్కువగా వినియోగిస్తారు. 

వీటిని ఎక్కువగా గరం మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తు ఉంటారు. ఈ రెండు రకాల యాలకులలో ఔషధ గుణాలు కూడా బాగానే ఉంటాయి. మనం తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను ఎదుర్కొనే లక్షణాలు యాలకుల్లో ఉంటాయి.

 యాలకులు గుండెకు చాలా మంచివి. వీటిలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సెక్స్ సామర్థ్యం పెరగాలంటే యాలకులు ఎంతో హెల్ప్ చేస్తాయి. వీటిలో సినేయిల్ ఉంటుంది. ఇది లిబిడోను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేయడానికి యాలకులు బాగా పని చేస్తాయి.అస్తమాకు చెక్ పెడతాయి యాలకులు. ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు, దగ్గు నివారణకు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి యాలకులు ఆకలిని పెంపొందిస్తాయి. 

ఆకలిని కాకపోవడం అనేది చాలా వ్యాధులకు కారణం అవుతుంది. క్యాన్సర్, అనోరెక్సియా వంటి వాటి బారిన కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో యాలకులను తింటే.. ఆకలి బాగా వేసే అవకాశం ఉంది.డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతో ఉపయోగపడతాయి. యాలకులు డిప్రెషన్ విషయంలో తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహాన్నియాలకులు కొంత మేరకు అదుపులో ఉంచగలవు. 

వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. యాలకుల్లోని వీటిలోని రసాయనాలు ఇవి నోటిలోని బాక్టీరియంపై చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. రోజూ రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలితే మంచి ఫలితం ఉంటుంది. యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు, దంతాలను ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో ఇన్ఫెక్షన్స్ రావు.

Comments