శ్యామ్ సింగరాయ్ పై మెగా పవర్ స్టార్ ప్రశంసలు.. నాని, సాయి పల్లవిని పొగిడేసిన రామ్ చరణ్..

న్యాచురల్ స్టార్ నాని.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. డిసెంబర్ 24న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‎గా నిలిచింది. చాలా కాలం తర్వాత నాని ఖాతాలోకి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చేరింది. ఇందులో నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. కలకత్తా బ్యాగ్రౌండ్ నేపథ్యంలో పిరియాడిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక నాని, సాయి పల్లవి నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. వారిద్దరి నటనను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ శ్యామ్ సింగరాయ్ సినిమాను వీక్షించినట్టున్నారు. శ్యామ్ సింగరాయ్, నాని, సాయి పల్లవిని పొగుడుతూ ట్వీట్ చేశారు రామ్ చరణ్. మా ఇండస్ట్రీ నుంచి మరో బ్రిల్లియంట్ సినిమా వచ్చింది. శ్యామ్ సింగరాయ్ అద్భుతమైన అందమైన అనుభూతి.. నాని, సాయి పల్లవి కెరీర్ లో ఇప్పటి వరకు ఇదే బెస్ట్ పర్ఫామెన్స్, కృతి శెట్టి, మడోన్నాలకు కంగ్రాట్స్. నిహారిక ఎంటర్‏టైన్మెంట్స్, చిత్రయూనిట్ కుదోస్ అంటూ చరణ్ ట్వీట్ చేశారు. ఇక చరణ్ ట్వీట్ చూసిన కృతి శెట్టి తెగ సంబరపడిపోయింది. ఓమై గాడ్ రామ్ చరణ్ గారు థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేసింది.

Comments