ఎన్‌కౌంటర్‌.. 60 మంది పాఠశాల పిల్లల్ని కాపాడిన బలగాలు

 


జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూలో ఉగ్రవాద దాడుల అనంతరం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. కుల్గాం జిల్లా అష్‌ముంజీ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు ఆర్మీ తెలిపింది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పాఠశాల విద్యార్థులతో సహా కనీసం 60 మందిని భద్రతా దళాలు రక్షించినట్లు ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదులున్నారన్న సమాచారం కుల్గాం పోలీసులు, బలగాలు ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి.     యాష్ముజి ప్రాంతాన్ని బలగాలు చుట్టిముట్టిన క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది హతమయ్యాడని ఆర్మీ పేర్కొంది. తీవ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి అని పేర్కొంటున్నారు. ఈ ఆపరేషన్‌లో పాఠశాల విద్యార్థులను రక్షించినట్లు తెలిపింది. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆర్మీ తెలిపింది.

atozupdates.in

Comments