దేశంలో బొగ్గు సంక్షోభం కమ్ముకొస్తున్న కారు చీకట్లు.. అమిత్ షాతో కేంద్ర మంత్రుల కీలక భేటీ

 విద్యుత్ సంక్షోభం ఏ ఒక్క రాష్ట్రం సమస్య కాదు.. దేశవ్యాప్తంగా కారు చీకట్లు తరుముకొస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. హోంమంత్రి అమిత్‌షాతో.. మరో ఇద్దరు మంత్రులు ఆర్కే సింగ్, ప్రహ్లాద్ జోషి సమావేశం అయ్యారు. తక్షణం చేపట్టాల్సిన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ.. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కొనసాగుతోందని తెలిపారు ఆర్‌కేసింగ్‌. విపక్షాలు ఈవిషయంపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 


డిస్కంలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తునట్టు తెలిపారు. ఇదిలావుంటే, దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడే అవకాశం లేదని ఓవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్రాలు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ప్రస్తుతం చాలా క్లిష్టపరిస్థితులు ఉన్నాయని మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పరిస్థితులను చక్కబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

దేశవ్యాప్తం బొగ్గు నిల్వలు భారీ తగ్గిపోయాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. పరిస్థితులను మెరుగుపరచడానికి మేమంతా కలిసి ప్రయత్నాలు చేస్తున్నాం’ అని డీల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అయితే, చాలా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయని.. ప్రస్తుతమున్న నిల్వలు కేవలం రెండు మూడు రోజులకే సరిపోతాయని ఢీల్లీ విద్యుత్‌శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ పేర్కొన్నారు. ఇదివరకు దాదాపు 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేవారమని..

 కానీ, ప్రస్తుతం ఆ ఉత్పత్తి సగానికి తగ్గిపోయిందన్నారు. అంతకుముందు విద్యుత్‌ సంక్షోభంపై జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి మోడీకి అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. రాజధానిలో విద్యుత్తు సంక్షోభం తలెత్తకుండా వెంటనే బొగ్గు, గ్యాస్‌ సరఫరా చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దేశంలో చాలా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడుతున్న దృష్ట్యా డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో కరెంటు కోతలకు ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. 

మహారాష్ట్రలోనే దాదాపు 13 విద్యుత్‌ కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులను త్వరగా చక్కబెట్టకపోతే మరికొన్ని రోజుల్లోనే నిత్యం 6 నుంచి 8గంటల విద్యుత్‌ కోత విధించక తప్పదని మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి సరిపడా బొగ్గును కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అటు కేరళ కూడా విద్యుత్‌ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరుపనున్నారు.

 అధికారులతో చర్చించిన అనంతరం విద్యుత్‌ కోతలపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, విద్యుత్‌ ఉత్పత్తి కోసం రాష్ట్రానికి అవసరమైన బొగ్గును కేంద్రం సరఫరా చేయట్లేదంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఈమధ్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి బొగ్గు నిల్వలూ వేగంగా అడుగంటుతున్నాయని, రానున్న రోజుల్లో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు మూతపడడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇప్పటికే అక్కడ పలు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా తగ్గడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు సమాచారం. దీంతో పంజాబ్‌లో నిత్యం 3 నుంచి 4గంటల పాటు కరెంటు కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడనున్నట్లు వస్తోన్న వార్తలను ఖండిస్తోంది. ఇలాంటివన్నీ అనవసర భయాందోళనలను సృష్టిస్తున్నాయని.. దేశంలో అవసరాలకు సరిపడా విద్యుత్‌ వనరులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు.

 కేవలం గెయిల్ (GAIL), డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. దేశంలో విద్యత్‌ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి అగాధం లేదని ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశంలోని థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచి సంక్షోభాన్ని తప్పిస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో కేంద్ర మంత్రులు సమావేశమై సోమవారం చర్చించారు. విద్యుత్ ఉత్పత్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips 

Comments