ఉద్యోగం ఇప్పిస్తామంటూ వ్యభిచార రొంపిలోకి.. పాతబస్తీ బాలికలపై ముఠా కన్ను..

 ఓ మైనర్‌ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పారు.. ఆ తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపారు.. ఆ తర్వాత గుట్టుచప్పడు కాకుండా బాలికతో వ్యభిచారం చేయిస్తూ.. వేలల్లో దండుకుంటున్నారు. ఈ వ్యభిచార ముఠా గుట్టును బాలాపుర్​పోలీసులు రట్టు చేశారు. బాలాపూర్​రాయల్​కాలనీలోని వ్యభిచార గృహంపై బాలాపూర్​పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. వ్యభిచార కూపం నుంచి 17 సంవత్సరాల మైనర్​బాలికకు విముక్తి కలిగించారు.


 వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకుని బాలాపూర్​పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2420 నగదుతో పాటు మూడు సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్​ ఇన్‌స్పెక్టర్​భాస్కర్​తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్​రాయల్​కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్​అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో రెహానా బేగం, సయ్యద్​అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలో రెండు నెలల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి రాయల్​కాలనీకి రెహానా బేగం మకాం మార్చింది. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో.. పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది. ఇదే అదనుగా భావించి రేహానా బేగం.. ఆ మైనర్​బాలికకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపింది.ఆ తర్వత రెహానాబేగం.. ఒక్కొక్క విటుడి నుంచి రూ.2వేలు వసులు చేస్తూ.. వాటిలో సగం డబ్బులు బాలికకు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో సమాచారం మేరకు బాలాపూర్​పోలీసులు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు.

 అనంతరం రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకొని వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మైనర్​బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్​ అబూబకర్, సల్మాబేగం, విటుడు మహ్మద్​ అష్యులను బాలాపూర్​పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips 

Comments