అల్లుడిని కాదనుకుని పుట్టింటికి వచ్చిన కూతురు అఫైర్ పెట్టుకుందని...

  


వివాహేతర సంబంధాలు జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. అయినప్పటికీ కొందరి తీరు మారడం లేదు. రోజూ ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అల్లుడితో విభేదించి పుట్టింటికొచ్చిన కూతురు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని కన్న తల్లిదండ్రులే ఆ మహిళను హత్య చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది.  

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... జిల్లాలోని పరమకుడి సమీపంలోని నాందుపట్టి గ్రామానికి చెందిన తెన్నారాసు, అమృతవల్లి దంపతులకు కౌసల్య అనే కూతురు ఉంది.కౌసల్యకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలలకే భర్తతో కౌసల్యకు మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇద్దరూ చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. భార్యాభర్తలు తిట్టుకోవడం, కొట్టుకోవడం నిత్య కృత్యంగా మారింది. 

భార్యాభర్తలిద్దరికీ పడకపోవడంతో నాలుగు నెలల క్రితం కౌసల్య పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటే కలిసి ఉంటోంది. అయితే.. కౌసల్య అదే గ్రామంలో ఉంటున్న ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కౌసల్య ఆ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం కొన్ని రోజులకు ఆమె తల్లిదండ్రులకు తెలిసింది.    

 భర్త దగ్గరకు వెళ్లిపోవాలని, ఇక్కడ ఉండి ఇవేం పనులని కూతురిని మందలించారు. తమతో పాటు ఉండాలనుకుంటే ఇకనైనా ఆ యువకుడికి దూరంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు కౌసల్యను హెచ్చరించారు. అయితే.. ఆమె తల్లిదండ్రుల మాటను పట్టించుకోకుండా ఆ యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయంలో కౌసల్యకు, ఆమె తల్లిదండ్రులకు మధ్య గత శుక్రవారం పెద్ద గొడవ జరిగింది.


Comments