మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. అది చూసిన భార్య చితిక్కొట్టుడు కొట్టిందంతే..

 
తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ ఇల్లాలి కోపం నషాళానికి ఎక్కింది. ఇంకేముంది భద్రకాళిలా మారింది. తన భర్త అక్రమ సంబంధం నెరపుతున్న  మహిళ ఇంటికి వెళ్లి ఆమెను చితక్కొట్టుడు కొట్టింది.   తన భర్తతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావంటూ నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి పొట్టుపొట్టుగా కొట్టింది.    

ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. సుల్తానాబాద్ ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొంతకాలంగా తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే పని చేస్తున్న మరో మహిళతో శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ భార్య.. కొంతకాలంగా వారిస్తూ వచ్చింది.

 అయినప్పటికీ మార్పు రాకపోగా కుటుంబాన్ని పట్టించుకోవడమే మానేశాడు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ భార్య.. ఇవాళ నేరుగా తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ ఇంటికి వెళ్లింది. తన భర్తతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెను నిలదీసింది. అదే ఆగ్రహంలో ఆమెను చితక బాదింది. నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చెప్పుతొ కొట్టింది. తన భర్త శ్రీనివాస్ మరో మహిళతో

 అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆరోపించింది. మూడు సంవత్సరాలుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగిస్తూ తమను పట్టించుకోవడమే మానేశాడంటూ తన పిల్లలతో కలిసి బోరున విలపించింది. కాగా, ఈ ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

Comments