దేశ రాజధానిలో మహిళలపై అకృత్యలు తగ్గడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 1200 పైగా అత్యాచార సంఘటనలు జరిగాయి. నిందితుల్లో 60 శాతం మంది బాధిత యువతులకు తెలిసినే వారు ఉంటున్నారు. తాజాగా వైద్యడే సహచర వైద్యురాలిని అత్యాచారం చేశాడు.
హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న ఆరు వాహనాలు.. ముగ్గురు దుర్మరణం..
ఢిల్లీ హౌస్ ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 26న ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఒక సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఇంటిలో
లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి
పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సహచర వైద్యులతో కలిసి ఓ మహిళా డాక్టర్ హాజరయ్యారు. రెసిడెంట్ డాక్టర్.. పార్టీ చివరిలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మహిళా వైద్యురాలికి ఇచ్చారు. అది తాగిన ఆమె సృహతప్పిన పోడిపోయారు.
పద్ధతి మార్చుకోమంటే ఇంత దారుణానికి ఒడిగడతావా ఒకరితో సన్నిహిత సంబంధం పిల్లలకు ఉరివేసింది
ఆ తర్వాత ఆమెను డాక్టర్ అత్యాచారం చేశాడు. ఈ విషయమై మహిళా వైద్యురాలు ఫిర్యాదు చేయడానికి భయపడింది. కొన్ని రోజుల తర్వాత కొద్ది మంది మిత్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. సెప్టెంబర్ 27 నుంచి నిందితుడు విధులకు హాజరు కావడంలేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల్లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం జరిగినట్లు ధృవీకరణ అయింది. దీంతో నిందితుడిపై ఐపీసీ 376,377 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Comments
Post a Comment