అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా విమానం కుప్పకూలింది. యూఎస్ క్యాలిఫోర్నియా సాంటీలోని నివాస ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం విమానం కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రెండు ఇళ్లు, ట్రక్ ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో పైలట్, యూపీఎస్ డ్రైవర్ మరణించారని పేర్కొన్నారు.పాఠశాల సమీపంలో అకస్మాత్తుగా విమానం కుప్పకూలి రోడ్డుపైకి దూసుకొచ్చిందని.. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. విమానం, పలు వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. సమాచారం మేరకు వెంటనే చేరుకున్న సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న వారిని మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
ALSO READ:
Iocl Recruitment 2021 - జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్
వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.ట్విన్-ఇంజిన్ విమానం గ్రీన్కాజిల్.. జెరెమీ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో దాదాపు పది ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ట్విన్ ఇంజన్ విమానం గాలిలో ఎగిరిన కాసేపటికే కుప్పకూలినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment