ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్‌ సూపర్ హిట్..ఒక్కరోజులో లక్షకు పైగా చాక్లెట్స్ అమ్మేశారట

 Flipkart Festive Sale: పండుగ సీజన్ ప్రారంభమైంది. పండుగ సీజన్ అంటే షాపింగ్ సీజన్. మన దేశంలో పండుగలు జరుపుకోవడం ఒక అద్భుతమైన సంప్రదాయం. ప్రజలు ఈ కాలంలో షాపింగ్ కోసం నెలల తరబడి ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ఇందులో బట్టలు, గృహోపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు వంటివి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, కంపెనీలు కూడా తమ వినియోగదారులను నిరాశపరచవు. ఇప్పుడు కొత్త ట్రెండ్ అంటే ఆన్‌లైన్ షాపింగ్.


 దీనికి ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ వినియోగదారుల కోసం ‘బిగ్ బిలియన్ డేస్’ లేదా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ వంటి అతి పెద్ద షాపింగ్ ఫెస్టివల్ ప్రకటించాయి. ఈ రెండు ఇ-కామర్స్ ఆఫర్లలో మొదటి నాలుగు రోజుల్లో, సుమారు 20 వేల కోట్ల విలువైన వస్తువులు అమ్ముడయ్యాయి. ప్రతి సంవత్సరం భారతీయ ఇ-కామర్స్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం బిగ్ బిలియన్ డేస్ సేల్‌ని అందిస్తుంది. ఈసారి కూడా, ఈ అమ్మకం అక్టోబర్ 3-10 వరకు కొనసాగింది. 

ఏడు రోజుల పాటు కొనసాగిన ఈ సేల్‌లో, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, హెల్త్‌కేర్ ఉపకరణాలు, ఫ్రిజ్‌లు, స్మార్ట్ టీవీల వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు 80 శాతం వరకు భారీ డిస్కౌంట్లను ఇచ్చింది. కంపెనీ త్వరలో పెద్ద దీపావళి సేల్‌ని ప్రారంభించబోతోంది. ఒకవేళ మీరు ‘బిగ్ బిలియన్ సేల్’ ను మిస్ అయి ఉంటె కనుక.. మీరు ‘దీపావళి సేల్’ ప్రయోజనాన్ని పొందవచ్చు.బిగ్ బిలియన్ డేస్ సేల్ పూర్తయిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపింది.

 ఇలా ధన్యవాదాలు చెప్పడానికి డేటాతో కొన్ని ఆసక్తికరమైన పంక్తులను తన వెబ్ సైట్ లో ఉంచింది. వారి సైట్‌లోని డేటా ప్రకారం, బిగ్ బిలియన్ సేల్‌లో చాలా వంట నూనె విక్రయం జరిగింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ప్రజలు కొనుగోలు చేసిన వంట నూనెతో 9 లక్షల ప్లేట్ల ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయవచ్చు అని చెప్పింది. అలాగే, పిండి..పప్పుల కొనుగోళ్ళ విషయానికి వస్తే.. వాటి బరువు 15 నీలి తిమింగలాలతో సమానం అని ప్రచారం చేసుకుంటోంది.

ఇక ప్రజలు కేవలం 24 గంటల్లో 1.2 లక్షల చాక్లెట్లను కొనుగోలు చేశారని కంపెనీ పేర్కొంది.బెంగళూరు మహిళలు బట్టలు కొనడంలో ముందుంటారు రేషన్, గృహోపకరణాలు, గాడ్జెట్‌లు మాత్రమే కాకుండా, మహిళలు కూడా బట్టల కోసం చాలా ఖర్చు చేశారు. ముఖ్యంగా మెట్రో సిటీ బెంగళూరు మహిళలు బట్టల కోసం గరిష్ట షాపింగ్ చేసారు. సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, బెంగళూరు మహిళలు 1,08,000 లక్షల పాశ్చాత్య దుస్తులను కొనుగోలు చేసారు. నవరాత్రి స్పెషల్..

ఈ సైట్ ప్రత్యేకంగా మహిళల కోసం. ఇక్కడ మహిళల కోసం 6 వేలకు పైగా లోదుస్తులు ఉన్నాయి. ఇది కాకుండా, వారు సౌందర్య ఉత్పత్తులను కూడా విక్రయిస్తారు. పండుగలలో మహిళల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ వారికి నవరాత్రి సేల్ అందిస్తోంది. నవరాత్రి సేల్‌లో, కంపెనీ 60 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఇది మాత్రమే కాదు, వారి ఆఫర్ మహిళలకు బాగా నచ్చింది, అది పాపులర్ డిమాండ్ అని చెప్పి వారు దానిని పొడిగించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips 

Comments