వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు..ఇద్దరు దొంగల ప్రేమకథ


వారు ప్రేమలో ఉన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. డబ్బు సరిపోవడం లేదు. ఈజీ మనీ కావాలి. అందుకే చోరీల బాట పట్టారు. వారు ప్రేమలో ఉన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. డబ్బు సరిపోవడం లేదు. ఈజీ మనీ కావాలి. అందుకే చోరీల బాట పట్టారు. అందులో కూడా వినూత్నమైన రూట్ ఎంచుకున్నారు. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి.. ఓనర్స్‌ను ఏమార్చి.. ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దొంగిలించేవారు. 

 కర్ణాటక బెంగళూరులో గతకొంత కాలంగా జరుగుతున్న ఈ తరహా దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా  గుర్తించారు పోలీసులు. వీరిద్దరికీ 3 సంవత్సరాల క్రితం పరిచయమైంది. వినయ్​పై ఓ హత్య కేసుతో పాటు.. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడని.. ఇప్పటికే రౌడీషీట్ ఉందని పోలీసులు తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. 

అతడిని లవ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. అతని కోసం ఏమైనా చేస్తానని.. జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. ప్రస్తుతం వినయ్-కీర్తనలు లవ్‌లో ఉన్నారని.. తనను లాంగ్​డ్రైవ్‌కు తీసుకెళ్లాలని, కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇవ్వాలని కీర్తన వినయ్​ని ఒత్తిడి చేసేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. అందుకే దొంగతనాలు చేసేవాడని .. వీటికోసం ఆమెనూ తీసుకువెళ్లేవాడని తేలింది.ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ క్రైమ్ కపుల్.. 

ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయిస్‌గా పరిచయం చేసుకొని ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. అనంతరం ఓనర్ దృష్టిని మరల్చి ఒక మొబైల్​ఫోన్, ల్యాప్​టాప్, రూ.15 వేల నగదును దొంగిలించారు. తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓనర్ ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips 

Comments