ఆహారంలో మత్తు మందు కలిపి.. ప్రియుడికి ఫోన్ చేసి.. దారుణానికి ఒడిగట్టిన భార్య.

 
సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తే కాలం ఇలా మారిందేమిటి అని అనిపిస్తోంది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు నేరాల గురించి వింటూనే ఉంటాం. తాజాగా ఓ వివాహిత భర్తను కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఆ విషయం భర్తకు తెలియటంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అంతమొందించింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామంలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజుకు కొనేళ్ల ఏళ్ల క్రితం మాధవితో వివాహం అయింది. 

అయితే వివాహానికి ముందే మాధవికి మక్తల్ మండలం కలవలదొడ్డి గ్రామానికి చెందిన మునేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. వివాహానంతరం కూడా మాధవి అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త రాజుకు తెలిసింది. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. పద్ధతి మార్చుకోవాలని రాజు హెచ్చరించినా ఆమె వినలేదు. భర్త ఒత్తిడి పెరగటంతో అతన్ని అడ్డుతొలగించుకోవాలనుకుంది మాధవి. ఈ విషయం తన ప్రియుడు మునేష్‎కు చెప్పింది. ఇద్దరూ కలిసి రాజు హత్యకు ప్రణాళిక రచించారు.

 అక్టోబర్ 2వ తేదీ రాత్రి రాజుకు అన్నంలో మత్తు ట్యాబ్లెట్లు కలిసి భోజనం వడ్డించింది మాధవి.రాజు మత్తులోకి జారుకోగానే ప్రియుడికి ఫోన్ చేసింది. మునేష్ తన స్నేహితులైన కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రలతో అక్కడకు చేరుకున్నాడు. వారు ఐదుగురు కలిసి రాజు మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం హత్యను ప్రమాదంగా చిత్రీకరించటానికి శవాన్ని తీసుకువెళ్లి పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద పడేసి వెళ్లిపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరీశీలించిన పోలీసులకు రాజు మృతి అనుమానాస్పదంగా అనిపించింది. ముందుగా భార్య మాధవిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె తనకు ఏమి తెలియదని చెప్పారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పింది.తనను వేధింపులకు గురిచేశాడని అందుకే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips 

Comments