మాకు సంబంధం లేదు చిరంజీవి సంచలన...పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం...

Breaking News;-పబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వంతో సయోధ్యగా ఉండాల్సిన చిత్ర పరిశ్రమ అనవసరంగా గొడవలకు వెళ్తుంది అని ప్రజల్లోకి సంకేతాలు వెళ్లాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కారణంగా మాకు అనవసర ఇబ్బందులు తలెత్తవచ్చంటూ లోలోనా మదనపడుతున్నారని వార్తలొస్తున్నాయి. 


ఈ క్రమంలో మచీలిపట్నంలో మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ సినీ నిర్మాతల భేటీ జరిగింది. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు నిర్మాతలు మంత్రిని కలిసినట్టు చెప్తున్నారు. పవన్‌ అభిప్రాయలకు తాము అనుకూలంగా లేమని, పవన్‌ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నాడు. 

Plz Subscribe to my Channel 

మెగాస్టార్ చిరంజీవి గారు తనకి ఫోన్ చేసి.. సినిమా ఈవెంట్లో పవన్ చేసిన వ్యాఖ్యలకి చింతుస్తున్నామని చెప్పాడని చెప్పారు. మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటి వరకు థియేటర్లో ఉన్న 50 శాతం ఆక్యూపెన్సీని 100 శాతం పెంచాల్సిందిగా కోరినట్లు చెప్పారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్న సమయంలో ఒక సినీ నటుడి వల్ల దురదృష్ట కర పరిణామాలు తలెత్తాయి.  

ఈ క్రమంలో చిరంజీవి కూడా తనకి ఫోన్ చేసి మాట్లాడాడని చెప్పాడు. ‘ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పొరబాటుకు సినీ ఇండస్ట్రీకి సంబంధంలేదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో జరిగిన గందరగోళంపై చిరంజీవి విచారం వ్యక్తం చేశాడని చెప్పాడు. ఇలా జరగాల్సి ఉండకూడని దురదృష్టవశాత్తు జరిగిన పరిణామాలపై తానె వచ్చి మాట్లాడతానని.. 

ప్రస్తుతం ఊటీలో షూటింగ్ లో ఉన్న కారణంగా వచ్చి కలవలేకపోతున్నాని.. షూటింగ్ అయిపోగానే నేనే వచ్చి మాట్లాడతానని చిరంజీవి చెప్పినట్టు మంత్రి పేర్ని నాని పేర్కొన్నాడు. కాగా మంత్రితో జరిగిన ఈ సమావేశంలో నిర్మాత దిల్‌ రాజు, బన్ని వాసు, సునీల్‌ నారంగ్‌, వంశీ రెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments