పేర్ని నానితో టాలీవుడ్‌ సినీ నిర్మాతల భేటీ...ఎవడో ఏదో మాట్లాడితే మా ఇండస్ట్రీకి సంబంధం లేదు

Plz Subscribe to my Channel 

 

మచీలిపట్నంలో మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ సినీ నిర్మాతల భేటీ ముగిసింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో సినిమా టికెట్ల విక్రయాలపై టాలీవుడ్‌ నిర్మాతల బృందం మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యింది. సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదన్నారు.

సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందన్నారు. ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి స్పష్టం చేశారు. సినీ పెద్దలు తమ సమస్యలను వివరించారన్నారు.  టికెట్‌ రేటు కనుక తక్కువగ ఉంటే ఇబ్బందుల్లో పడతామని, ప్రోడక్షన్‌ కాస్ట్‌ కూడా పెరిగిందని దీనిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా నిర్మాతల బృందం తెలిపినట్లు మంత్రి చెప్పారు.

Plz Subscribe to my Channel 

 ఈ సందర్భంగా నిర్మాతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇక ‘లవ్ స్టోరీ’నిర్మాత సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. ఇక్కడికి సినీ సమస్యలు, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం గురించి మాట్లాడటానికి వచ్చామని.. ఎవడో, ఏదో మాట్లాడితే మా ఇండస్ట్రీకి సంబంధం లేదు.. సినీ ఇండస్ట్రీ అనేది సున్నితమైన అంశం అని.. దాన్ని దయచేసి రాజకీయాల్లోకి లాగవొద్దని అన్నారు. సినీ ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతో మంది ఉన్నారని.. అలాంటి వారికి రాజకీయ రంగు పులమొద్దని సునీల్‌ నారంగ్‌ అన్నారు. 

అయితే గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసి వ్యాఖ్యలపై ఏకీభవించడం లేదని పరోక్షంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఓ వైపు సినీ ఇండస్ట్రీ గురించి తాను పోరాడుతున్నా అంటూ పవన్ కళ్యాణ్ అంటుంటే.. మరోవైపు సినీ నిర్మాతలు మాత్రం మంత్రి పేర్ని నానిని కలిసి మాట్లాడటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments