పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..

 


ఇటు మా అధ్యక్ష ఎన్నికలు.. అటు ఆన్‌లైన్ టికెటింగ్ ఇష్యూ.. టాలీవుడ్‌ వేడెక్కిపోతోంది. మా ఎన్నికలకు వేళ దగ్గరపడుతుండటంతో ప్రకాష్ రాజ్- మంచు విష్ణు ప్యానల్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.. ఇద్దరి ప్యానల్ సభ్యులు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో పవన్ విషయంలో మంచు ప్యానెల్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రకాష్‌రాజ్‌. ఇటీవల నరేష్ మాట్లాడుతూ..

Plz Subscribe to my Channel  

 ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేశారు.. దానికి బదులుగా ప్రకాష్ రాజ్ కూడా నరేష్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. నేను చెప్పని మాటలనుకూడా  చెప్పానంటూ అబద్దాలు చెప్తున్నారు అని ప్రకాష్ రాజ్ అన్నారు. చిరంజీవి, కృష్ణ గారు అందరి వారు.. వారిని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు అని ప్రకాష్ రాజ్ అన్నారు. అలాగే మా ఎన్నికల్లోకి పవన్ కళ్యాణ్‌ను లాగడం పై కూడా ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు. అనవసరంగా ఇందులోకి పవన్‌ను లాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడండి అంటూ వార్ నింగ్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. 

పవన్ సినిమా మార్నిగ్ షో కలక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ అంటూ విమర్శించారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ మొదట నటుడు.. ఆ తర్వాతే రాజకీయనాయకుడు..అన్నాడు ప్రకాష్ రాజ్. ఇదిలా బండ్లగణేష్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరు మంచి చేయడానికి పోటీ చేస్తున్నారు. అందుకే నేను విత్ డ్రా చేసుకున్నా అని బండ్ల గణేష్ అన్నారు. అలాగే పోసాని కృష్ణ మురళి గురించి మాట్లాడుతూ.. పోసాని ఓ కాలం చెల్లిన టాబ్లెట్‌లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments