పలు ఇళ్ల దగ్దం..బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస.. 29 ఇళ్లకు నిప్పు పెట్టారు

 


బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ గ్రామంలోని 29 ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో ఇళ్లతోపాటు రెండు గడ్డివాములతో పాటు ఇతర వస్తువులు కాలి బుడిదయ్యాయి. కాగా ఈ సంఘటన బంగ్లా రాజధానికి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది.రాజధాని Bangladesh నగరం ఢాకాకు 255 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఎంత కోపమొస్తే మాత్రం అలా చేస్తారా భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య   

 గ్రామానికి చెందిన ఒక హిందూ యువకుడు ఫేస్‌బుక్ పోస్ట్‌లో  మతాన్ని అగౌరవపరిచాడని పుకారు రావడంతో పోలీసులు మత్స్యకారుల కాలనీకి వెళ్లారు. పోలీసులు ఆ వ్యక్తి ఇంటి చుట్టూ కాపలాగా ఉండడంతో, దాడి చేసిన వారు సమీపంలోని ఇతర ఇళ్లకు నిప్పుపెట్టారని తెలిసింది. ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ మాజిపారాలో 29 నివాస గృహాలు, రెండు వంటశాలలు, రెండు బార్న్‌లు, 20 గడ్డివాములను తగలబెట్టినట్లు పేర్కొంది.

తల్లితో సహజీవనం చేస్తూ కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని స్థానికి మీడియా పేర్కొంది. ప్రాణనష్టం గురుంచి ఎలాంటి సమాచారం లేదు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలోని దుర్గా పూజ వేదిక వద్ద మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి.సోషల్ మీడియాలో మత విద్వేషాల వ్యాప్తికి సంబంధించి పోస్టులు చేసిన డజన్ల కొద్దీ మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్.. చాంద్పూర్, నోఖాలీలో జరిగిన దాడులలో కనీసం నలుగురు హిందూ భక్తులు మరణించారని ఆరోపించారు.

బ్యూటీ పార్లర్‌కు వెళ్లి అదృశ్యమైన పెళ్లికూతురు...

 ఇంతలో ఢాకా నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెనిలో హిందువులకు చెందిన దేవాలయాలు, దుకాణాలపై దాడులకు సంబంధించి ఎలైట్ నేర నిరోధక శక్తి రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. “మతపరమైన హింసకు పాల్పడినందుకు, సోషల్ మీడియాలో ప్రజలను ప్రేరేపించినందుకు వారిని అరెస్టు చేశారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు ప్రధాన మంత్రి షేక్ హసీనా హింస వెనుక ఉన్న దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చింది.

ఆమె వయసు 15, అతని వయసు 14.. ఇద్దరు ప్రేమించుకున్నారు

 హిందూ దేవాలయాలు, కుమిల్లాలోని దుర్గా పూజ వేదికలపై దాడుల్లో పాల్గొన్న తప్పించుకోలేరని తెలిపారు. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారు ఏ మతానికి చెందినవారైనా శిక్షించబడతారని ధాకేశ్వరిలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. కాగా అంతకు ముందు జరిగిన అల్లర్లలో ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య మొత్తంగా 6కు చేరింది.నౌఖాలీ జిల్లాలో ఇస్కాన్ దేవాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

దసరా సందర్భంగా ఇస్కాన్ ఆలయం, భక్తులపై 200 మందికి పైగా దుండగులు దాడి చేశారు. హింసాత్మక దాడిలో 3 మంది భక్తులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.దాడి చేసిన వారు మెజారిటీ వర్గానికి చెందిన వాళ్లు.. గూండాల్లా ప్రవర్తించారు. ముగ్గురు భక్తులు మరణించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి..

Comments