Genelia లేటెస్ట్ క్యూట్ లుక్స్‌తో కేక ..

ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి

టాలీవుడ్‌లో చేసింది త‌క్కువ సినిమాలే అయిన అంద‌రి మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. సత్యం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించింది. బొమ్మ‌రిల్లు సినిమాలో జెనీలియా హాసిని అనే పాత్ర‌లో క‌నిపించి అందరి మ‌న‌సుల‌ని గెలుచుకుంది. ఈ చిత్రం త‌ర్వాత జెనీలియా క్రేజ్ మ‌రో లెవ‌ల్‌కి వెళ్లింది. జెనీలియా తెలుగులో సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. . 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం.


ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ద్వారానే జెనీలియా తెగ సంద‌డి చేస్తుంటుంది.తాజాగా జెనీలియా తన గ్లామర్ కి మరింత పదును పెడుతూ సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా పిక్స్ షేర్ చేసింది. . 34 ఏళ్ల వయసులో కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. బ్లాక్ డ్రెస్‌లో జెనీలియాని చూసి అంద‌రి మ‌తులు పోతున్నాయి. రీసెంట్‌గా జెనీలియా… నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్’ షోకి అతిథులుగా వచ్చారు. దీంట్లో సెలబ్రిటీలు ట్రోల్‌కి సంబంధించిన కామెంట్స్‌ని చదివి వారి రెస్పాన్స్‌ తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ జంటకి సైతం ఓ వీడియో చూపించాడు. అందులో నటి ప్రీతి జింటాని రితేశ్‌ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు కామెంట్స్ చేయ‌గా, జెనీలియా స్ట‌న్నింగ్ ఆన్స‌ర్ ఇచ్చి అల‌రించింది.




Comments