ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి
ఈరోజుల్లో మనుషుల కన్నా కూడా కుక్కలపై ప్రేమని ఎక్కువగా చూపిస్తున్నారు.వారిని కంటికి బిడ్డలా చూసుకుంటూ ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. కుక్కకి చిన్న సమస్య వచ్చినా కూడా తల్లడిల్లిపోతుంటారు. అయితే కుక్కలని అంత ప్రేమగా చూసుకునే యజమానులు బయటకు ఎక్కడికైన తీసుకెళ్లాల్సి వస్తే ఇబ్బందులు పడుతుంటారు.
కుక్కలను సాధారాణంగా బస్సులు,రైళ్లు, విమానాలలో వంటి వాటిలో అనుమతించరు. ముంబై నుంచీ చెన్నై వెళుతోన్న ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్‌లో, ఒక మహిళా ప్రయాణీకురాలు, మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్ అంతా బుక్ చేసేసింది. అందులో ఆమెతో పాటూ కేవలం తన పెట్ డాగ్ మాత్రమే ప్రయాణించింది. ఈ సంఘటన గురించి ఎయిర్ ఇండియా అధికారులు ఎవరు స్పందించడం లేదు.
ఎయిర్‌బస్ 321లో 12 బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్న ఓ క్యాబిన్ మొత్తం ఒక్కరే బుక్ చేశారని మాత్రం అంగీకరించారు. సాధారణంగా ముంబై నుంచీ చెన్నై వెళ్లటానికి ఒక్క బిజినెస్ క్లాస్ టికెట్టుకి 20 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఇప్పుడు పెంపుడు కుక్క కోసం సదరు ఎయిర్ ఇండియా ప్రయాణికురాలు రెండు లక్షలకు పైగా ఖర్చు చేశారని అంటున్నారు. ఈ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment