Teenmaar Mallanna: బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో బలపడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇప్పటికే పలువురిని తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ తాజాగా క్యూన్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్నని కూడా తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ సర్కార్‌పై సమరశంఖం పూరించి.. కేసుల్లో ఇరుక్కుని జైలుపాలైన క్యూన్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ఆయన కమల తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సొంత చానల్ క్యూ న్యూస్ అధికారికంగా తెలిపింది.
Also Read;-
15 ఏళ్ల బాలికపై 9 నెలలుగా 30 మంది అత్యాచారం...
ఆయన బీజేపీలో చేరనున్నట్లు క్యూ న్యూస్ టీం ప్రకటించింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన తీన్మార్ మల్లన్నని విడుదల చేయించేందుకు ఆయన భార్య మమత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాకి లేఖలు రాయడం సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై తీన్మార్ మల్లన్న సునిశిత విమర్శలు గుప్పిస్తారు.
Most Eligible bachelor Team Akhil & Bhaskar Interview
ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి
ఇటీవలనే ఓ కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ దొరికింది. అయితే మరో కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అరెస్టైన కేసులో బెయిల్ పై విడుదల అవుతారని మల్లన్న అనుచరులు భావించారు. కానీ మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన జైలు నుండి విడుదల కావడం కష్టంగా మారింది.మల్లన్న జైలుకెళ్లి ఇప్పటికి 34 రోజులు అవుతోంది. ఆయన్ను విడిపించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బయటపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment