ఖాళీ కడుపుతో అస్సలు నిద్రపోకండి అలా చేస్తే అనారోగ్యం బారిన పడినట్లే


 మనం అనారోగ్యం పాలవ్వడానికి ముఖ్యంగా జీవనశైలే కారణమని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ చాలామంది అవసరమైన విషయాలపై, ఆరోగ్యంపై దృష్టిసారించరు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబాన్ని చూసుకోవడంలో.. తమను తాము పట్టించుకోరు. దీంతోపాటు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వారు సైతం ఆరోగ్యంపై అంతగా ఆరోగ్యంపై దృష్టిసారించరు. సమయానికి ఆహారం తినకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంటుంది. అయితే.. ఉదయం వేళ పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవద్దని పదేపదే చెబుతున్నప్పటికీ.. కొంతమంది అల్పాహారం వదిలి టీ మాత్రమే తాగుతుంటారు. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ పట్టించుకోరు. ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఎలాంటి పదార్థాలను తినకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వేళ పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

పరగడుపున కాఫీ, టీకి దూరంగా ఉండాలి'-చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఆయుర్వేదంలో పరగడుపున టీ, కాఫీ తాగడం హానికరమని పేర్కొన్నారు. కాఫీ, టీలో కొన్ని ఆమ్ల పదార్థాలు ఉంటాయి. అవి అజీర్ణానికి కరణమవుతాయి. కాఫీ లేదా టీ తాగడం అలవాటు ఉంటే.. దానికి ముందు ఏమైనా తినడం మంచిదని సూచిస్తున్నారు

ఈ పదార్థాలను తినకండి;-ఆయుర్వేదంలో కొన్ని ఆహార పదార్థాల గురించి స్పష్టంగా సూచనలు చేశారు. ఉదయం పెరుగు, టమోటాలు, ఔషధాలు, స్వీట్లు, అరటిపండ్లు, కారంగా ఉండే పదార్థాలను తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పదార్థాల్లో అధిక మొత్తంలో యాసిడ్ ఆమ్లాలు ఉంటాయిని.. ఇవి పరగడుపున తింటే అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని పేర్కొంటున్నారు.

సమస్యలు రాకుండా;-ఖాళీ కడుపుతో ఉంటే.. కోపం, చికాకులు ఎక్కువై.. ప్రశాంతతకు భంగం కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. రోజంతా తినకుండా అస్సలు ఉండకూడదు. దీనివల్ల మానసికంగా కుంగిపోతారని.. ఉదర సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొంటున్నారు. ఇలా ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయి తగ్గి ఆరోగ్యానికి హానికరం కలుగుతుంది.

ఖాళీ కడుపుతో నిద్రపోవద్దు;-చాలా మందికి ఉదయం వేళ చాలా సేపటివరకు నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఎక్కువసేపు తినకుండా ఉండటం ఆరోగ్యానికి హానికరం. దీని కారణంగా మీ జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవాలి.

చూయింగ్ గమ్ అస్సలు నమలొద్దు ;-చాలా మంది ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్‌ను నములుతుంటారు. అలా చేయడం వల్ల బరువు తగ్గుతుందని భావిస్తారు. కానీ.. ఇలాచేస్తే జీర్ణవ్యవస్థ బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్సర్ల లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments