పోసాని మాట‌లకు కౌంట‌ర్..ఇచ్చిన బండ్ల‌ గణేష్...

ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి


 రిపబ్లిక్‌ మూవీ ప్రీ-రిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పోసాని సంచ‌ల‌న కామెంట్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న ప‌వ‌న్ త‌ప్పుడు కామెంట్స్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్ గురించి అనేక కామెంట్స్ చేయ‌డంతో పవన్‌ ఫ్యాన్స్‌ తనని టార్గెట్‌ చేసి బెదిరింపులు దిగారని ఆరోపిస్తూ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవన్‌ ఫ్యాన్స్‌తో గ్రూపులు పెట్టుకున్నారు. 

ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి

ఫంక్షన్లలో నీ గ్రూపులతో పవన్‌.. పవన్‌ అని నినాదాలు చేయించుకుంటావు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు నేను భయపడను. నన్ను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా. నీకు నీ కటుంబం ఎంత గొప్పో.. నాకు నా కుటుంబ కూడా అంతే గొప్పా. విమర్శలు తట్టుకోలేని వాడివి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత తిట్టినా నేను డిమోరలైజ్‌ కాను. ఒకే నన్ను చంపిస్తావా.. 

నేను రెడీ. నా డెడ్‌ బాడీ కూడా నిన్ను వదలదు’ అంటూ పోసాని ధ్వజమెత్తారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎప్పుడు మ‌ద్దతుగా నిలిచే బండ్ల గ‌ణేష్ … ఇప్పుడు పోసాని గ‌తంలో మాట్లాడిన వీడియో షేర్ చేస్తూ చుర‌కలు అంటించాడు.బండ్ల ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పోసాని ప‌వ‌న్‌ను పొగుడుతూ తెలుగులోనే కాదు, ఇండియాలోనే అత్యంత క్రేజ్ ఉన్న హీరో అని అన్నారు. ఆయ‌న సినిమాల్లో న‌టిస్తానంటే తాను బ్లాంక్ చెక్ ఇస్తాన‌ని అన్నారు. దాంట్లో ప‌వ‌న్ ఎంత రెమ్యున‌రేష‌న్ కావాలంటే అంత రాసుకోవ‌చ్చున‌ని అన్నారు. వీడియో పోస్ట్ చేసిన బండ్ల గ‌ణేష్ జ‌స్ట్ ఆస్కింగ్ పోసానిగారు అని కామెంట్ పెట్టారు.

ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments