తరగతిలో చదువులు చేతిలో సెల్‌ఫోన్‌లోకి వచ్చాయి ఆన్‌లైన్‌ క్లాస్‌ కోసం ఫోనిస్తే ...

 


రోజులు మారాయి తరగతిలో చదువులు చేతిలో సెల్‌ఫోన్‌లోకి వచ్చాయి. అసపలు ఫోన్‌ అంటే ఏంటో కూడా తెలియని పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆండ్రాయిడ్‌ ఫోన్లు కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిని సరిగ్గా వాడుకుంటే వారి భవిష్యత్‌కు బాటలు వేస్తాయి. కాదని పెడదారి పడితే అదే ఫోన్లు వారి జీవితాన్ని చిదిమేస్తాయి. అలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి కూడా. తాజాగా మియాపూర్‌లో వెలుగు చూసిన ఘటన అందరినీ కలచి వేసింది.

మియాపూర్‌ హనీస్‌ కాలనీలో ఉండే బాలిక కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. వారికి ఆన్‌లైన్‌ క్లాసుల కోసం అని తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనిచ్చారు. బాలిక అదే పనిగా ఆమెకు మామ వరస అయ్యే వ్యక్తితో మాట్లాడుతోంది. వారు తరచూ చాటింగ్‌ చేసుకునేవారు. ఆ విషయం ఇంట్లో వారికి తెలిసి బాలికను గట్టిగా మందలించారు. చాటింగ్‌ చేయకూడదంటూ వారించారు. ఆమె తల్లిదండ్రులు చేసిన పనికి నొచ్చుకుంది. రెండ్రోజుల క్రితం సెల్‌ఫోన్‌లో సిమ్‌ కార్డును మార్చేశారు. 

ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి

తల్లిదండ్రులు చేసిన పనితో బాలికకు బాగా కోపం వచ్చి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులుగా చికిత్స పొంది శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో ఆ బాలిక మరణించింది. బాలిక చేసిన పనికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. చదువుకోమని సెల్‌ఫోన్‌ కొనిస్తే ఆమె చాటింగ్‌లు అంటూ ప్రాణాలు తీసుకుంది. 

Also read;-

వేలల్లో బెదిరింపు కాల్స్‌ పోసాని కృష్ణ మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు...

వయసు సంబంధం లేకుండా ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను బెదిరించడం, భయపెట్టడం, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడం చేస్తున్నారు. వారిపై కొండంత ఆశలు పెట్టుకున్న తల్లదండ్రులను శోఖసంద్రంలో వదిలేసి పోతున్నారు. ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలతో తల్లిదండ్రులు చెప్పుకోలేని వ్యధను అనుభవిస్తున్నారు. ఆ బాలిక చేసింది సరైన పనేనా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments