పవన్ కళ్యాణ్ పై బాబు మోహన్ సీరియస్ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం

 


పవన్ కళ్యాణ్ పోసాని ఎపిసోడ్ రసవత్తర రాజకీయాలకి తెరలేపుతుంది. వరుస ప్రెస్ మీట్స్ తో పోసాని పవన్ పై పేల్చిన ఘాటు వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సినిమా ఈవెంట్లో రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగాడు పోసాని. దాంతో పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్ లో పోసానిపై దాడికి ప్రయత్నించారు పవన్ ఫ్యాన్స్. ఈ ఉదంతంతో షాక్ కి గురైన పోసాని.. తనకి పవన్ అభిమానుల నుండి హాని ఉందని పోలీసులకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు.

Plz Subscribe to my Channel 

 ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే పోసాని నివాసంపై అర్ధరాత్రి దాడికి దిగారు ఇద్దరు దుండగులు. హైదరాబద్ ఎల్లారెడ్డి గుడాలోని పోసాని పాత నివాసంపై అర్ధరాత్రి ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేసారు. పోసాని ఇంట్లో లేని సమయంలో, వాచ్ మెన్ కుటుంబస్తులు మాత్రమే ఉంటున్నారు. దాంతో ఆ దాడి చేసింది పవన్ అభిమానులే అని పోసాని పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అయితే ఇంత జరుగుతున్నా.. పవన్ ఈ ఉదంతంపై రియాక్ట్ అవ్వకపోగా.. ఏపీ ప్రభుత్వంపై మరింత ఆవేశంగా స్పీచులిస్తున్నాడ అయితే ఈ తతంగంతో తమకెక్కడ సంబంధాలు అంటగడుతారో అని ఇప్పటికే సినీ నిర్మాతలు దిల్ రాజు సారథ్యంలో ఏపీ ప్రభుత్వ పెద్దలని కలిసి వివరణ కూడా ఇచ్చుకున్నారు. 

ఈ క్రమంలో ఈ పరిణామాలన్నింటిపై స్పందించాడు బాబు మోహన్. పవన్ వ్యాఖ్యల మీద ఈ సీనియర్ నటుడు కొంచం ఘాటుగానే స్పందించారు. పవన్ – పోసాని ఇద్దరూ ఇండస్ట్రీ పరువు పోకుండా వ్యవహరించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వల సహకారం ఇండస్ట్రీకి అవసరం అని బాబు మోహన్ అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఓ సమస్యకు పరిష్కారం అడిగారు. దానికి వాళ్ళు సరే అన్నారు. దాని విమర్శించడం సరికాదు అని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మనమే పరిష్కరించుకొవాలి కానీ.. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల మన సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. ఏదైనా అన్యాయం జరిగితే పెద్ద మనుషులతో కూర్చొని సాల్వ్ చేసుకోవాలి అంటూ బాబు మోహన్ చెప్పుకోచ్చాడు

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments