కర్ణాటకలో దారుణం.. కూతురు ప్రేమించిన వ్యక్తిని ఇంటికి రమ్మని

 


తమ కూతురు ఇతర మతస్థుడితో ప్రేమలో పడిందని తల్లిదండ్రులు ఓ దారుణానికి ఒడిగట్టారు. తమ కుమార్తె ప్రేమించిన వ్యక్తిని హత్య చేయించారు. చివరికి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బెళగవికి చెందిన ఓ బాలిక, ఓ 24 యువకుడిని ప్రేమించింది. అయితే అతడు ఇతర మతాని చెందినవాడని తల్లిదండ్రులు వారి ప్రేమను ఒప్పుకోలేదు. అయినా వారు ప్రేమను కొనసాగించారు. కోపం పెంచుకున్న తండ్రి పుండలిక మహారాజ్ సెప్టెంబర్ 26న ఆ యువకుడిన కలవాలని రమ్మన్నాడు. దీంతో అతడు మహారాజ్ కలిసేందుకు తళ్లితో కలిసి వెళ్లాడు. తమ కూతురితో సంబంధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లికొడుకును బెదిరించారు. అతడి ఫోన్లో ఉన్న అమ్మాయి ఫొటోలను బలవంతంగా డిలీట్ చేయించారు. సెప్టెంబర్ 28న అతడిన చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ యువకుడిని తమ ఇంటికి రావాలని మహారాజ్ పిలిచాడు. దీంతో యువకుడు అక్కడికి వెళ్లాడు. యువకుడికి సంబంధించిన వస్తువులు లాక్కొని యువకుడిపై మహారాజ్‎, కొంత మంది దాడి హత్య చేశారు. అనంతరం రైల్వే ట్రాక్ పక్కన మృతదేహాన్ని పడేశారు. అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పుండలిక మహారాజ్ (39), కుతబుద్ధిన్ అల్లాబక్ష్ (36), సుశీల ఈరప్ప (42), మారుతి ప్రహ్లాద్ (30), మంజునాథ్ తుకారాం (25), గణపతి జ్ఞానేశ్వర (27), ఈరప్ప బసవన్నీ కుంబర (54), ప్రశాంత్ కల్లప్ప (28), ప్రవీణ్ శంకర్ (28), శ్రీధర్ మహాదేవ దోనిని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తామే చంపినట్లు ఒప్పుకున్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips 

Comments