అమెరికా నుంచి వచ్చిన భర్త.. ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య.. అసలు కారణం ఏంటంటే..

 


తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది భార్య. పెళ్లైన ఏడాదిన్నర నుంచే వేధింపులకు గురిచేస్తున్న భర్త.. విడాకులు నోటీసులు పంపి అమెరికాకు చెక్కేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ మహిళ. తాజాగా తన భర్త అమెరికా నుంచి తిరిగి వచ్చాడని తెలుసుకున్న భార్య.. నేరుగా భర్త ఇంటి వద్దకు వచ్చి ఆందోళనకు దిగింది. 

తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. నెల్లూరులో జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన పవన్‌కు, శ్రవంతికి 2010లో వివాహం జరిగింది. ఐతే, ఏడాదిన్నర వరకు వీరిద్దరి కాపురం బాగానే సాగింది. ఆ తరువాతే వివాదాలు మొదలయ్యాయి.భార్య శ్రవంతిని భర్త పవన్ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో శ్రవంతి తన పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత శ్రవంతికి విడాకుల నోటీసులు పంపి.. 

అమెరికాకు వెళ్లిపోయాడు పవన్. అయితే, తాజాగా పవన్ ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రవంతి.. నేరుగా పవన్ ఇంటికి వెళ్లింది. కానీ, తనను ఇంట్లోకి రానివ్వకుండా పవన్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని శ్రవంతి ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందే బైఠాయించింది శ్రవంతి. ఈ అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

Comments