సికింద్రాబాద్‌ రైల్వేలో 4103 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు.. టెన్త్‌, ఐటీఐ అర్హత

 scr.indianrailways.gov.in: దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.


సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే లోని 35 ఎస్టాబ్లిష్‌మెంట్‌ల లోని 11 ట్రేడ్ ల లో ఈ 4,103 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను టెన్త్‌, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారం గా ఎంపిక చేస్తారు.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు  https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఏపీ మెకానిక్‌ - 250
  • కార్పెంటర్‌- 18
  • డీజిల్‌ మెకానిక్‌ - 531
  • ఎలక్ట్రీషియన్‌ - 1019
  • ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ - 92
  • ఫిట్టర్‌ - 1460
  • మెషినిస్ట్‌ - 71
  • ఎంఎంటీఎం - 5
  • ఎంఎండబ్ల్యూ- 24
  • పెయింటర్‌ - 80
  • వెల్డర్‌- 553
  • AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips 

Comments