కుటుంబాన్ని వదిలేసి పరార్ 21ఏళ్ల యువకుడి ట్రాప్‌లో పడ్డ వివాహిత


 భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్న మహిళ తన కంటే చాలా చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడింది. అంతే కుటుంబాన్ని వదిలేసి అతడితో  పారిపోయి పెళ్లి చేసుకుంది. అయితే ఆ యువకుడికి అప్పటికే ప్రియురాలు ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆమె స్వగ్రామంలో ఉంటుండటంతో అతడు వివాహితను లైన్లో పెట్టి కొద్దిరోజులు ఎంజాయ్ చేశాడు. అయితే తన ప్రియురాలు తిరిగి వస్తుందని తెలుసుకున్న వివాహితను వదిలించుకోవాలనుకున్నాడు.  

ఢిల్లీలో మత్తుమందు ఇచ్చి వైద్యురాలిని అత్యాచారం చేసిన ఎయిమ్స్ డాక్టర్..

 నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్లిపో అని చెప్పగా ఆమె వినిపించుకోలేదు. అందరినీ వదిలేసి వచ్చేశా.. నాకు ఇక నువ్వే దిక్కు.. అని ఆమె చెప్పడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది ఢిల్లీకి చెందిన అనూజ్ కుమార్ (21) ఓ యువతిని ప్రేమించి కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆ యువతి గతేడాది తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. దీంతో తన శారీరక వాంఛలు తీర్చుకునేందుకు అనూజ్ స్థానికంగా ఉండే ఓ వివాహితకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. 

పద్ధతి మార్చుకోమంటే ఇంత దారుణానికి ఒడిగడతావా ఒకరితో సన్నిహిత సంబంధం పిల్లలకు ఉరివేసింది

అతడి మాయలో పడిన వివాహత భర్త, కుటుంబాన్ని వదిలేసి అనూజ్‌ను పెళ్లాడి మరోచోట కాపురం పెట్టింది. ఇటీవల అనూజ్‌కు అతడి ప్రియురాలు ఫోన్ చేసి తాను ఢిల్లీకి వచ్చేస్తున్నానని చెప్పింది.దీంతో కంగారుపడిన అనూజ్ వివాహితను భర్త వద్దకు వెళ్లిపోవాలని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్ని స్నేహితులు రంజాన్, నౌషద్ సాయం కోరాడు.

అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు..ఇంతలో

 గత నెల 30న ముగ్గురూ కలిసి ఆమెను అడవిలోకి తీసుకెళ్లి చంపేశారు. ఆ తర్వాత వారే పోలీసులకు ఫోన్ చేసి అడవిలో ఓ మహిళ మృతదేహాన్ని చూశామని చెప్పారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ పరిశీలించగా బాధిత మహిళ ఈ ముగ్గురితో కలిసే అడవిలోకి వెళ్లినట్టు గుర్తించారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో సోమవారం ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments