సహజీవనం ప్రియుడు మోసం చేయడంతో యువనటి ఆత్మహత్య...

 


ప్రియుడు మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురై టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి శవం కుళ్లిపోయి, ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం బయటపడింది.  బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ  ఘటన వివరాలిలా..  కావలి అనురాధ అనే యువతి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌ బస్తీలో నివాసం ఉంటుంది. సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. 

Plz Subscribe to my Channel 

కొన్నాళ్ళు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆమె అతడితో సహజీవనం చేస్తోంది. అయితే అతడు మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయంలో కిరణ్ తో గొడవపడిన అనురాధ.. మనస్తాపానికి గురై తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతురాలి సోదరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుడైన కిరణ్‌ కోసం గాలిస్తున్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments