జగన్ మోహన్ రెడ్డికి, నాకు గొడవలు పెట్టాలని అనుకుంటున్నారా డైలాగ్ కింగ్ మోహన్ బాబు

 హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, నాకు గొడవలు పెట్టాలని అనుకుంటున్నారా.. ఈ ప్రశ్న అడిగింది ఏ వైసీపీ నాయకుడో కాదు.. డైలాగ్ కింగ్ మోహన్ బాబు. అవును ఏపీ సీఎం జగన్ కు, తనకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారా అని ప్రముఖ మీడియా సంస్థ ఎండీని అడిగారు మోహన్ బాబు. ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేక కార్యక్రంమలో పాల్గొన్న మోహన్ బాబు.. హోస్ట్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పారు.హోస్ట్ అడిగిన చాలా ప్రశ్నలకు మోహన్ బాబు ఆలోచించి మరీ అన్సర్స్ చెప్పారు. కొన్ని ప్రశ్నలకు చిరాకుగా మొహం పెడితే, కొన్ని ప్రశ్నలకు ఆవేశంగా, మరి కొన్ని ప్రశ్నలకు వేధాంత పంధాలో, ఇంకొన్ని ప్రశ్నలకు కామెడీగా సమాధానాలు చెప్పారు మోహన్ బాబు. కొన్ని సందర్బాల్లో మీడియా సంస్థ ఎండీకి, మోహన్ బాబుకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అది చంద్రబాబు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చోటుచేసుకుంది. కార్యక్రమంలో హోస్ట్ అడిగిన ప్రశ్నల్లో.. 

ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి

మోహన్ బాబులో వేదాంతం ఎందుకు?, ఎవరి మాడు పగిలింది? మోహన్ బాబు బిక్క మొహం ఎందుకు పెట్టారు? ‘కలెక్షన్ కింగ్’ పశ్చాత్తాప పడుతున్నారా? మోహన్ బాబు దేనికి సిద్ధం… సంధికా? సమరానికా? నీచ, నికృష్ట, దరిద్ర, భ్రష్టుత్వ.. వంటి పదాలు మోహన్ బాబు నోటి వెంట ఎందుకు వచ్చాయి? ‘మొరిగే కుక్కల’ని మోహన్ బాబు ఎవర్ని అన్నారు? ఇలాంటి చాలా ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పారు మోహన్ బాబు. ఇక దాసరి, చిరంజీవి గురించి చాలా విషయాలు చెప్పారు డైలాగ్ కింగ్. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, తనకు మధ్య బంధుత్వం నుంచి మొదలు, ప్రస్తుతం ఇండస్ట్రీలోని పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, కుటుంబ బాంధవ్యాలు వంటి ఎన్నో అంశాలపై మోహన్ బాబు తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటికే యూట్యూబ్ లో మోహన్ బాబుకు ఇంటర్వూకు సంబందించిన ప్రోమో దూసుకుపోతోంది. పూర్తి ఇంటర్వూ ఆదివారం ప్రసారం కానుంది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments