ఎంత కోపమొస్తే మాత్రం అలా చేస్తారా భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య

 


మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకోవడం సాధారణం. కొన్నిసార్లు ఇద్దరూ కొట్టుకుంటారు కూడా. అలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. కొందరు ఈ గోల మనకెందుకులే అని విడిపోతుంటారు. 

లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి

మరికొందరు కలహాలతోనే కాపురాన్ని కొనసాగిస్తుంటారు. ఇంకొందరు సర్దుకుపోయి జీవితం సాగిస్తుంటారు. కానీ ఓ భార్యమాత్రం భర్తపై కోపంతో రగిలిపోయింది. ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో గానీ..

ఉద్యోగం ఇప్పిస్తామంటూ వ్యభిచార రొంపిలోకి.. పాతబస్తీ బాలికలపై ముఠా కన్ను

 ఆమె కోపం నషాలానికి అంటింది. భర్తకు బుద్ధి చెప్పాలనుకుని ఆమె చేసిన పనికి ఇప్పుడతడు ఆస్పత్రి పాలయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భర్తపై కోపంతో ఆమె చేసిన పనికి అంతా షాకయ్యారు. ఈ పంచాయతీ ఆస్పత్రి నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్  లోని పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరులో దారణం చోటు చేసుకుందిభర్తపై కోపంతో ఓ మహిళ అతడిపై మరిగే వేడినీళ్లను పోసింది.

ఢిల్లీలో మత్తుమందు ఇచ్చి వైద్యురాలిని అత్యాచారం చేసిన ఎయిమ్స్ డాక్టర్

 చేతుల మీదో ఇంకెక్కడో పోస్తే ఫర్వాలేదు. ఏకంగా ఆ వేడి నీటిని అతడి మర్మాంగంపై పోసింది. . ఏలూరు పతేబాధ సెంటర్ లో టైలర్ గా పనిచేసే వ్యక్తికి అక్టోబర్ 15న భార్యతో గొడవ జరిగింది. ఇద్దరు తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు. ఐతే భార్యమాత్రం కోపాన్ని తగ్గించుకోలేదు. అతడ్ని ఏమైనా చేయాలని భావించి అర్ధరాత్రి నిద్రపోతుండగా బాగా మరిగించిన నీళ్లను అతడి మర్మాంగంపై పోసింది. ప్రస్తుతం అతడు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మైనర్‌ను లోబరుచుకుని పెళ్లి చేసుకున్న యువతి...

 సమాచారం అందుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో చిత్తూరు జిల్లా పలమనేరులో ఇలాంటి ఘటనే జరిగింది. స్థానికంగా ఉండే కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరి కాపురం తొలుత సజావుగానే సాగింది. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా కేశవ మద్యానికి బానిసయ్యాడు. పలమనేరు టమాటా మార్కెట్లో హమాలిగా పనిచేసే కేశవ వచ్చిన డబ్బంతా మద్యానికి తగలేస్తుండేవాడు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

 అనంతరం ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 23వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఇంటి మేడపైకి ఎక్కి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో కేశవ.. రేఖను దూషించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కొట్టాడు. భర్త చేసిన పనికి కోపోద్రిక్తురాలైన రేఖ ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కాలితో తన్నింది. ఆవేశంలో పలుసార్లు తన్నడంతో నొప్పి భరించలేక మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. దీంతో తన భర్త మద్యం మత్తులో మేడపై నుంచి కిందపడిపోయాడని అందర్నీ నమ్మించింది. కేశవ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటకు వచ్చింది.


Comments