Sundarakanda Sarga 1 part-4-అతనిపై పుష్పములు కురిపించి, ప్రియమిత్రుని నీటిపట్టువఱకు

Sundarakanda;- ఆకాశమున మేఘమువలె నున్న హనుమంతుని శరీరముపై వివిధ పుష్పాలు చిగురుటాకులు, మొగ్గలు పడుటచే అతడు మిణుగురులచే కొండవలె ప్రకాశించెను.

ఆ వృక్షములు హనుమంతుని కొంతదూరము వెంబడించి, అతని వేగము క్రమముగా వృద్ధినొందుటచే విడివడి, అతనిపై పుష్పములు కురిపించి, ప్రియమిత్రుని నీటిపట్టువఱకు పంపి మఱలివచ్చిన మిత్రులవలె నీట మునిగెను.

హనుమంతుని శరీరవేగముచే పై కెగసిన ఆ చెట్లపూలు, మిక్కిలి తేలికగా నున్న వగుటచే నీటిలో పడి మునగకుండెను. అవి నీటిపై తేలియాడుచు విచిత్రమగు శోభ కలిగియుండెను. అట్లు పుష్పములతో కూడిన మహాసముద్రం వందలకొలది నక్షత్రములతో కూడిన ఆకాశమువలె ప్రకాశించెను.

అనేకవర్ణములు గల ఆ పుష్పములు హనుమంతుని మేనిపై పడగా, వానితో ఆయన ఆకాశమున మెఱుపుతీగల సమూహముతో విలసిల్లు మేఘము వలె ప్రకాశించెను.

హనుమంతుని గమన వేగముచే నింగి కెగసిన పుష్పములు సముద్రమున పడగా, వానిచే ఆ సముద్రము ఉదయించిన సుందరనక్షత్రములచే ఆకాశమువలె కనుపించెను

ఆకాశమున చేతులు చాచి హనుమ ఎగురుచుండగా అతని రెండు చేతులు పర్వతశిఖరమునుండి వెలువడిన రెండు ఐదు తలల పాము వలె నుండెన

కపివరు డగు హనుమంతుడు సముద్రజలమునకు చేరువగా పోవునపుడు తరంగపంక్తులతో గూడ సముద్రజలమును త్రాగివేయుచున్నట్లును, సముద్రునిపై దూరముగా సంచరించినపు డాకాశమును కబళింపగోరుచున్నట్లును అగపడెను.

హనుమంతు డట్లు వాయుమార్గమున పయనించుచుండగా మెరుపుల వలె వెలుగు అతని కన్నులు, పర్వతమండలి రెండగ్నులవలె ప్రకాశించెను.

వాసర శ్రేష్టుడగు హనుమంతుని వృత్తాకారములైన పెద్ద పెద్ద కన్నులు పింగళవర్ణము కలవై, ఉదయించిన చంద్రసూర్యులవలె ప్రకాశించుచుండెను.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty TipsComments