Sundarakanda Sarga 1 part-3-వేగవంతుడగు హనుమంతుడు వానరులతో పలికి, దూర మని కాని, సముద్ర

Sundarakand;స్వర్గమునను ఆమె కనబడదేని, ఎంతమాత్రము శ్రమచెందక, రాక్షసరాజగు రావణుని బంధించి వచ్చెదను

సర్వవిధములుగను కార్యము సాధించియే నేను సీతమ్మతో తిరిగి వత్తును. అట్లు కాదేని రావణునితో గూడ లంకనే పెకలించి యిటకు తెచ్చెదను.అని వానరశ్రేష్ఠుడు, వేగవంతుడగు హనుమంతుడు వానరులతో పలికి, దూర మని కాని, సముద్ర మని కాని ఆలోచింపక, వేగముగ ఎగిరెను. అట్లెగురుచు తన్ను తాను గరుత్మంతునికి సాటిగా భావించెను
హనుమంతుడు అట్లు ఎగురుచుండగా ఆ కొండపై నున్న చెట్లు అతని వేగమువలన తమ కొమ్మలను ముడుచుకొని పైకెగసినవి. v
అతడు మదించిన కొంగలతో, విరబూసిన పూలతో ఒప్పారు చెట్లు తన తొడల వేగముచే పెకలించి తనతో పైకెగురజేయుచు నిర్మలాకాశమున పయనించెను.
అట్లతని శరీరవేగముచే పై కెగసిన చెట్లు, దూరప్రయాణము చేయుటకు బయలుదేరిన తమ బంధువులు సాగనంప వచ్చిన చుట్టములవలె క్షణకాలము హనుమంతు ననుసరించినవి.
అట్లు గమనవేగముచే ఎగురగొట్టబడిన చెట్లు, తక్కిన శ్రేష్ఠవృక్షములును, రాజు వెంట పోవు సైన్యములు వలె హనుమంతుని అనుసరించినవి.
కొనవరకు విరియబూసిన అనేక వృక్షములు చుట్టును కుదురుకొని యుండగా, వాని నడుమ హనుమంతుడు, మహాపర్వతమువలె ఆశ్చర్యము గొలుపుచు కానవచ్చెను.
అట్లు పై కెగసిన చెట్లలో చేవకలిగి బరువైన చెట్లు హనుమంతు ననుసరింపజాలక దేవేంద్రునివలన భయపడిన పర్వతములవలె సముద్రమున పడి మునిగినవి.

Comments