శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ...Sudheer Babu హీరోగా, ఆనంది హీరోయిన్‌గా తెరెకెక్కిన


Sudheer Babu హీరోగా, ఆనంది హీరోయిన్‌గా తెరెకెక్కిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.palasa1978 ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. శ్రీదేవి సోడా సెంటర్ తో సుధీర్ బాబు సక్సెస్ అందుకున్నాడా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఊరిలో సూరిబాబు ఒక లైటింగ్ టెక్నీషియన్. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా బిజీగా ఉంటాడు. ఇక అదే ఊరిలో శ్రీదేవి ఫ్యామిలీ ఒక సోడా సెంటర్ నడుపుతుంటుంది. శ్రీదేవి తండ్రి తన కులానికి చెందిన వ్యక్తినే అల్లుడిగా తెచ్చుకోవాలని చూస్తుంటాడు. కానీ.., శ్రీదేవి-సూరి బాబు ప్రేమలో పడతారు. అదే ఊళ్లో కాశి అనే వ్యక్తి ఉంటాడు. అతను చెడ్డ వాడు. తన కులానికి చెందిన వ్యక్తితో శ్రీదేవికి ఒక సంబంధం తెస్తాడు. అయితే.. వీరందరిని ఎదిరించి, చివరికి తన ప్రేమ కోసం శ్రీదేవి-సూరిబాబు ఏమి చేశారు అన్నదే చిత్ర కథ. హీరోయిన్ ఆనంది ఆకట్టుకుంది. నరేశ్ కి చాలా రోజుల తరువాత ఒక మంచి పాత్ర దొరికింది.

శ్రీదేవి సోడా సెంటర్ మూవీ.. నేటి కుల జాడ్యాన్ని ప్రశ్నించే రీతిలో ఉంటుంది. లవ్ స్టోరీకి ఇంటర్ లింక్ గా చేసి, ఒక సోషల్ పాయింట్ చెప్పాలి అనుకోవడమన్నది చాలా మంచి ఆలోచన. కానీ.., ఆ చెప్పే విధానం చాలా ముఖ్యం. శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు ఇక్కడే విఫలం అయ్యాడు. చివరి 15 నిమిషాలలో ఒక బలమైన పాయింట్ చూపించడానికి రెండున్నర గంటలు సినిమా తీయడం అన్నది ఈరోజుల్లో వర్క్ అవుట్ కాదు. ఒకవైపు “మనీ హేస్ట్, ఫ్యామిలీ మేన్, మీర్జాపూర్” లాంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుడు రోజురోజుకి షైన్ అయిపోతున్నాడు. ఇలాంటి తరుణంలో కథని పరిగెత్తించకపోతే ఓ మంచి కథ కూడా వృధా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ లో హీరోని ఎక్స్ పోజ్ చేయడానికి చాలా సన్నివేశాలను వాడుకోవాల్సి వచ్చింది.

  AtoZupdates.in;- NewsCrimeCinema,  ఆరోగ్యం, Jobs, Offer ProductsUniversity JobsRailway JobsOngc Jobs

 కానీ.., సుధీర్ బాబు కష్టం వల్ల అవన్నీ ఆకట్టుకునేలా సాగాయి. కానీ.., సెకండ్ ఆఫ్ చాలా వరకు నీరసంగా సాగుతుంది. కానీ.., చివరి 15 నిముషాలు శ్రీదేవి సోడా సెంటర్ మూవీకి ప్రాణం పోశాయి. దీంతో.., ఈ మూవీ కొంత వరకు గట్టెక్కగలిగింది. ఇక హీరోగా సుధీర్ బాబు కష్టానికి ఫుల్ మార్క్స్ వేయాల్సిందే. హీరోయిన్ ఆనంది ఆకట్టుకుంది. టెక్నికల్ గా బెస్ట్ వరకు వచ్చింది. మణిశర్మ బ్యాగౌండ్ స్కోర్ అదిరిపోయింది. దర్శకుడు క‌రుణ కుమార్ గనుక కథని చెప్పే విధానంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే.. శ్రీదేవి సోడా సెంటర్ రేంజ్ మరోలా ఉండేది.

Rating;-2.5/5

Comments